Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
తొర్రూరు పట్టణ అభివృద్ధి కి కృషి చేస్తామని చైర్మన్ మం గళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగ సురేందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ ము ఖ్యమంత్రి కెసిఆర్ పర్యటించిన సందర్భంగా తొర్రూరు మున్సిపల్ అభివృద్ధికి 25 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పాలకుర్తిలో కలిసి 25 కోట్లు మంజూరు చేయించినందుకు వా రిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పంచాయ తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో పట్టణాన్ని మరింత అభివద్ధి చేస్తామన్నారు. తొర్రూర్లో సీసీ రోడ్లు నిర్మాణానికి సుమారు 11 కోట తో సుమారు 10 కిలోమీటర్ల మేర రోడ్ నిర్మాణం చేపట్టా మన్నారు. మున్సిపా లిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. తొర్రూర్ మున్సిపాలిటీ రానున్న రోజుల్లో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే అన్ని వార్డు లలో పనులు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే మంత్రి సహకారంతో మోడల్ మా ర్కెట్ పనులు కూడా పూర్తయ్యాయని త్వరలో ప్రారంభోత్సవం కూడా జరుగు తుందన్నారు. కనీవినీ ఎరగని రీతిలో యతి రాజారావు పార్క్ నిర్మాణం కూడా పూర్తి చేశామన్నారు. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, వైద్య వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, కౌన్సిలర్లు భూసాని రాము, తుణం రోజా, సంగీత రవి, యమునా జంప్ప, సునీత జైసింగ్, గజానంద్, అలివేలు, రేవతి శంకర్, నాగజ్యోతి నాగరాజు, గుగులోతు శంకర్, కొలుపుల శంకర్, మాధవి అనిల్, కో ఆప్షన్ మెంబెర్స్. యంకథ నర్సయ్య, జలీల్, కుర్ర కవిత శ్రీనివాస్, జల్కం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.