Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త ఇండ్ల నిర్మాణాలపై స్పెషల్ డ్రైవ్ - మున్సిపల్ కమిషనర్ సింగారపు కుమార్
నవతెలంగాణ-తొర్రూరు
మున్సిపల్ పరిధిలో గృహాలు నిర్మించుకునే వారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసు కొని పూర్తి అనుమతులు పొందిన తర్వాతనే నిర్మాణా లు ప్రారంభించుకోవాలని మున్సిపల్ కమిషనర్ సింగారపు కుమార్ అన్నారు. మంగళవారం తొర్రూరు పట్టణంలో నిర్మాణం అవుతున్న కొత్త ఇండ్ల నిర్మాణాల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న మని తెలిపారు. తొర్రూర్‌లో ఉన్న కొత్తగా నిర్మిస్తు న్న 15 వార్డ్ 14 వార్డ్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని, సర్వి నగర్, మెయిన్ రోడ్ల పైన నూతనంగా నిర్మస్తున్న 11 ఇండ్లను పరిశీలించామన్నారు. అందులో 4 ఆన్లైన్ పర్మిషన్ తీసుకున్న రనారని, 3 సేటెబ్యాక్ లేకుండా నిర్మిస్తున్న ఇండ్లకు నోటీస్ జారీ చేస్తామన్నారు. నోటీస్ ముట్టిన మూడు రోజులలో రి అడ్జెస్ట్ కాకపో తే మున్సిపల్ చట్టం ప్రకారం 25 రెట్లు జరిమానా విదిచడం జరుగుతుందన్నారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించగలరని అ న్నారు. ఆన్లైన్లోపర్మిషన్ తీసుకున్న తర్వాతనే నిర్మాణం చేపట్టాలని లేకపోతే మున్సి పల్ చట్టం ప్రకారం బారి జరిమాన విధించడం జరుగుతుందన్నారు. ఫ్రంట్ సైడ్ 1.5 మీటర్స్ సెట్ బ్యాక్, చుట్టూ కూడా వన్ మీటర్ వదిలిపెట్టి నిర్మాణం చేసుకో వాలన్నారు.సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను ప్రతి ఒక్కరూ నిషేధించాలని అన్నా రు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ ఏఈ రంజిత్, హెల్త్ అసిస్టెంట్ రాజు, జూనియర్ అసిస్టెంట్ శ్రావణ్, సానిటరీ ఇన్స్పెక్టర్ దేవేందర్. శ్రీకాంత్, ప్రశాంత్ పాల్గొన్నారు.