Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మనఊరు-మనబడి పాఠశాలలను ప్రారంభో త్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె శశాంక అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో మనఊరు-మనబడి పాఠశాలల అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థ లు) అభిలాష అభినవ్, ట్రైనీ కలెక్టర్ పింకేశ్వర్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మనఊరు-మనబడి క్రింద 316 పాఠశాలలకుగా ను 32 మాత్రమే పనులు పూర్తి అయ్యాయని మిగ తా పాఠశాలలు త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా మండలాల వారీగా గ్రౌండింగ్ అయిన టువంటి పాఠశాలల పనులు ఎంత వరకు పని జరు గుతున్నాయని,అవిఏస్టేజిలో ఉన్నాయి అన్నది మం డలాల వారీగా ఏఈలు, ఎంఈఓలను అడిగి తెలు సుకున్నారు. ప్రతివారం పనుల పర్యవేక్షణ చేసి సా ధ్యమైనంత వరకు మనఊరు.మనబడి పాఠశాలలను ప్రారంభించడానికి తయారు చేయాలని, పాఠశాలల్లో అభివృద్ధి పనులలో భాగంగా అవసరమైన టైల్స్, డై నింగ్ హాల్, త్రాగునీరు,గ్రీన్ బోర్డ్స్, డెస్క్ లు, నేమ్ బోర్డ్స్, బ్యూటిఫికేషన్ పనులు, వర్షపు నీటిని నిల్వ చే యడానికి ప్రదేశాలను, పూర్తి చేసే పనులకు సంబం ధించి మండల అధికారులు తనిఖీలు చేపట్టి పర్య వేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.సివిల్ వర్క్స్ ఎన్ని పాఠశాలలు పూర్తి అయినవి, పెండింగ్ లో ఎ న్ని పాఠశాలలు ఉన్నాయని అధికారులను అడిగి తె లుసుకున్నారు. పాఠశాలల బ్యూటిఫికేషన్ పై విద్యా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, పూర్తి చేసి న పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వ యంతో సమీక్ష నిర్వహించుకునే విధంగా చూసుకో వాలని సూచించారు. మనఊరు మనబడి అభివృద్ధి పనులలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా చేపట్టే పనులు పూర్తి చేయాలన్నారు. సివిల్ పనులు పూర్తి అయిన పాఠశాలకు పెయింటింగ్ పనులు త్వరగా పూర్తిచేసి అప్పచెప్పాలని పెయింటింగ్ సభ్యు లకు తెలిపారు. పనులు పూర్తయిన వాటిని నిర్దేశిం చిన స్ప్రెడ్ షీటులో పంపించాలని అది ప్రతి ఒక్క అధికారి పంపే విధముగా చూసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, ఆర్ అండ్ బి ఈ ఈ తానేశ్వర్, పంచాయతీ రాజ్ అధికారులు,ఇంజనీరింగ్ అధికారులు, ఎం.ఈ.ఓలు,పెయింటింగ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.