Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
మండలంలోని జీడికల్ గ్రామంలోని జీడికం టి శ్రీ వీరాచల రామచంద్రస్వామి వారి దేస్థానం ప్రారంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు.జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో చేస్తున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సదరు ఏజెన్సీ సూచించారు. వీరి వెంట తహశీల్దార్ అంజయ్య, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, నాగేందర్,ఉపేందర్ రెడ్డి, జిల్లా దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, ఆనంద, కుమార్ స్వామి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.