Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఈఓల పనితీరుపై ప్రజాప్రతి నిధుల ఆగ్రహం
నవతెలంగాణ -వెంకటాపురం
తెలంగాణ ప్రభుత్వం ఏజన్సీలో తలపెట్టిన పోడుభూముల సర్వే ఆదివాసీలకు పట్టాలు ఇచ్చేందుకా లేక భూముల నుంచి వెళ్లగొట్టేందుకా అని మంగళవారం ఎంపీపీ చెరుకూరి సతీష్ అధ్య క్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమా వేశంలో అధికారులను బర్లగుడెం సర్పంచ్ కొర్సా నర్సింహమూర్తి నిలదీశారు. మండలంలోని 16 పంచాయితీల్లో 1,758 మంది దరఖాస్తులు వస్తే 81 దరఖాస్తులనే పరిగణలోకి తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పోడు దారులకు పట్టాలు ఇచ్చేందుకా గ్రామ సభలు పోడు నుంచి ఆదివాసీలను వేళ్లగొ ట్టెందుకా అని నిలదీశారు. పంచాయితీల్లో రైతు వేదిక కేంద్రాలు ఎందుకు ఉన్నట్లు అని వ్యవసాయ శాఖ అధికారి నర్సింహరావును ప్రజాప్రతి నిధులు నిలదీశారు. ఏఈఓలు వ్యవసాయం పై అవగాహన కల్పించడంలో వైఫల్యం చెందుతున్నారన్నారు. ప్రభుత్వ రాయితీలు, బీమా వంటి పధకాలకు ధర ఖాస్తు చేసుకోవాల్సిన సమయాల్లో ప్రజాప్రతి నిధు లకు ఫోన్లో మెసేజ్ పెట్టి రైతులకు తెలపండి అంటూ ప్రజాప్రతి నిధులకు హుకూం జారీ చేసు ్తన్నారని రామచంద్రాపురం సర్పంచ్ అట్టం సత్యనా రాయణ వ్యవసాయ ఖాఖ అధికారిని నిలదీశారు. రైతులకు ప్రజాప్రతి నిధులు అవగాహన కల్పించి పనులు చేస్తే ఏఈఓలు మాత్రం జీతం తీసుకు టారా అని వారి పనితీరుపై అసహనం వ్యక్తం చే శారు. అంగన్వాడీ కేంద్రాలు అద్దే భవనాల్లో ఏర్పాటు చేస్తే పిల్లలు ఇబ్బందులు ఏదుర్కోంటు న్నారని పక్కా భవనాల నిర్మాణాలకు అధికారులకు ప్రతి పాధనలు పంపాలని వైస్‌ఎంపీపీ సయ్యద్ హుస్సేన్ ఐసీడీఏస్ సీడీపీఏకు తెలిపారు. పాత్రాపురం, టేకులబోరు గ్రామాల్లో అంగన్వాడీ భవననిర్మాణాల కోసం కలెక్టర్ రూ.5 లక్షలు ప్రత్యేక నిధులు కేటాయించారని ఆ నిర్మాణాలకోరుకు స్తలం కేటాయించాలని కోరారు. ఈ సమావేవంలో పలు శాఖల పనితిరు పై అధికారులతో ప్రజాప్రతి నిధులు సమీక్షించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ పాయం రమణ, తహసీలార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి
అధికారులు చేపట్టిన పోడు సర్వే సక్రమంగా లేదని తిరిగి సర్వే నిర్వహించడంతో పాటు ధరఖాస్తు దారులందరికీ పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఆదివాసీ నవనిర్మాణ సేన ఆద్వర్యంలో మండలంలో బారీ ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ సమావేశ మందిరం ఎదుట బైటాయించారు. మండల పరిషత్ సమావేశంలో పోడు భూముల పై తీర్మానం చేయా లంటూ నినాదాలు చేశారు. తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, ఎంపీపీ చెరుకూరి సతీష్, జడ్పీటీసీ పాయం రమణలకు ఆదివాసీలు విడివిడిగా వినతి పత్రాలు అందజేశారు. ఈసందర్బంగా ఆదివాసీ నవనిర్మాణ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు మాట్లాడుతూ.. మండలంలో పోడు రైతులు 1,758మంది ధరఖాస్తులు చేసుకుంటే 70 మంది కి మాత్రమే హక్కు పత్రాలు ఇవ్వడానికి అనుమతులు వచ్చాయన్నారు.తిరస్కరణకు గురేన ధరఖాస్తులు ఎందుకు తిరిగి పరిశీలించట్టేదనా ఎద్దేవా చేశారు. బర్లగుడెం, రాచపల్లి, ఎదిర పంచాయితీల్లో గ్రామసభలే జరగ లేదన్నారు. ప్రజలు అటవీ గ్రామసభలు తిరస్కరించారన్నారు. అధికారులు మాత్రం ఆ పంచాయితీల్లో గ్రామసభలు జరిగినట్లు తప్పుడు నివేధికలు ఉన్నతాదికారులకు ఎందుకు పంపారన్నారు. పోడు ధరఖాస్తు చేసుకున్న రైతులందరికి పట్టాలు ఇవ్వాలని లేని పక్షంలో న్యాయ స్దానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిం చారు. రామచంద్రాపురం, సూరవీడు, తిప్పాపురం ,రాచపల్లి, బర్లగుడెం రైతులు పాల్గొన్నారు.