Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి
నవతెలంగాణ-భూపాలపల్లి
బాలల హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జంగెడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ వార్డుల బాలల పరిరక్షణ కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రతి వార్డులోని బాలల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు, బడి మానేసిన బాలలు, బాలలపై వేదింపులు, మత్తు పదార్థాలకు బానిసయ్యే బాలలు, పౌష్టికాహార లోపంతో బాధ పడే బాలలు లేని వార్డులుగా ప్రతి వార్డును తీర్చి దిద్దాలని పిలుపునిచ్చారు. వార్డు స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలను మండల, జిల్లా కమిటీల దృష్టికి తీసుకెళ్లాలని సూ చించారు. అనంతరం 1 వ, 2 వ, 11వ, 14 వ వార్డుల కమిటీ లను ఏర్పాటు చేసి వాటి పని తీరును బాలల సంరక్షణ అధికారి వెంకటస్వామి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ధార పూలమ్మ, బానోతు రజిత, ఐసీడీఎస్ సూపర్వైజర్ సీత, డీసీపీయూ లీగల్ కం ప్రొబేషన్ ఆఫీసర్ మొహినొద్దీన్, సోషల్ వర్కర్ లింగారావు, ఇతర కమిటీల సభ్యులు పాల్గొన్నారు.