Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-చిట్యాల
తెలంగాణ ప్రాంత అభివృద్ధి దేశానికి ఆదర్శమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు మంగళ వారం మండలంలోని గోపాలపురం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం మండలంలోని నవాబుపేట గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ దళిత కాలనీలో 10 లక్షలతో సిసి రోడ్డు, పాఠశాల ప్రహరీ పనులకు ఆయన శంకు స్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ కసిరెడ్డి సాయి సుధా రత్నాకర్ రెడ్డిని అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో అమలు చేస్తూ గ్రామాల అభివద్ధికి సీఎం కేసీసార్ పాటుపడుతున్నా రన్నారు. నవపేట గ్రామంలో రూ.35 లక్షలతో పలు అభివద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింద న్నారు. రూ.10 లక్షలతో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎస్సీ కాలనీలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ ఏర్పాటు చేయడం జరి గిందన్నారు. ముదిరాజుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ముదిరాజుల కమ్యూనిటీ హాల్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి వెలుగు ద్వారా అంధత్వ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే కేసీఆర్ లక్ష్యం అన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసమే బీఆర్ఎస్ స్థాపించారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డిని ముదిరాజ్ కమ్యూనిటీ నాయకులు సన్మానించారు. అనంతరం నవ పేట గ్రామ దళిత నాయకులు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నేరెళ్ల ఓదెలు గ్రామంలో దళితవాడలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరలో కమ్యూనిటీ హాల్ కోసం పది లక్షల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి జెడ్పిటిసి గొర్రె సాగర్, ఎంపీడీవో రామయ్య బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆరేపల్లి మల్లయ్య ప్రధాన కార్యదర్శి మడికొండ రవీందర్రావు, ఏరుకొండ రాజేందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఏరుకొండ గణపతి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పిట్ట సురేష్, నవాబుపేట ముదిరాజ్ సంఘం నాయకులు, చిట్యాల ఎంపీటీసీి కట్కూరి పద్మ నరేందర్, జూకల్ సర్పంచ్ పుట్టపాక మహేందర్ ఉపసర్పంచ్ చాడ ఆనంద్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.