Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ - ములుగు
పురాతన కట్టడాలు, వారసత్వ సంపదను ముఖ్యమంత్రి కేసీఆర్ కులగొట్టి తన వాస్తు ప్రదర్శిస్తున్నాడని టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముందుగా రామప్పలోని రామలింగేశ్వర స్వామి అలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు, గైడ్ల ద్వారా ఆలయ చరిత్ర, ప్రాముఖ్యత అడిగి తెలుసుకున్నారు. రామప్ప నుండి హత్ సే హత్ పాదయాత్ర కొనసాగించారు. ఎంపీ రేవంత్రెడ్డి తలపెట్టిన హత్ సే హత్ పాదయాత్ర మంగళవారం ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క నేతత్వంలో రామప్ప నుండి మొదలైయింది. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ... కాకతీయుల కాలం నాడు రేచర్ల వారు నిర్మించిన రామప్ప ఆలయం నేటికి 800 సంవత్సరాలు పూర్తి చేసుకుందని అన్నారు. అద్బుతమైన కళాఖండాలు, ప్రపంచానికి సంబందించిన బిన్న సంస్కంతులను ఇక్కడ కళాఖండాలు ఉంచిన కాకతీయుల వైభోగాన్ని కోనియాడారు. ముఖ్య మంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అలయాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నమాని చేపుతున్నారని, కానీ, యునోస్కో గుర్తింపు పొందిన రామప్ప అలయంలో పరిస్థితి ఇందకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఆర్కియాలజి డిపార్ట్మెంట్ నామా మాత్రంగా ఉందన్నారు. సెక్రటేరియట్ దగ్గర పురాతన కట్టాడాలు, వారసత్వపు సంపదను ముఖ్యమంత్రి కేసీఆర్ కూలగొట్టి తన వాస్తు ప్రదర్శించాడని ఏద్దేవా చేశారు. తక్షణమే అవసరమైన మేరకు నిధులు కేటాయించి కళా సంపదను కాపాడాలని, ప్రత్యేక పర్యవేక్షణ చూపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. రామప్ప నుండి మొదలైయిన పాదయాత్ర సాయంత్రం వరకు ములుగు చేరుకుని కార్నర్ మీటింగ్ నిర్వహించారు. నేటి నుండి మహబూబాబాద్ డోర్నకల్ నియోజక వర్గం వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. హత్ సే హత్ పాదయాత్రలో పూర్తి స్థాయిలో ప్రాంత ప్రజలు, లంబాడిలు, ఆదివాసిలు, గిరిజనేతరులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.