Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాశివరాత్రి, శ్రీరామనవమి, సేవలాల్ జయంతి పండుగలపై ప్రత్యేక దృష్టి
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ-పాలకుర్తి
మహాశివరాత్రి బ్రహ్మౌత్సవాల్లో భాగంగా ఈనెల 12 నుండి 16 వరకు చంద్రిక అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమంతో పాటు 17 నుండి 21 వరకు మహాశివ రాత్రి బ్రహ్మౌత్సవాలను అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసే విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. సిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి మహాశివరాత్రి బ్రహ్మౌత్సవాల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో అభివద్ధి పనులతో పాటు సోమనాధ జ్ఞాన మందిరం కళ్యాణ మండపం మిషన్ భగీరథ కార్యాలయ పనులను జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశారుతో కలిసి సందర్శించి పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో గల మాంగళ్య ఫంక్షన్ హాల్లో ఆలయ చైర్మన్ వెనుకదాసుల రామచంద్ర య్య శర్మ అధ్యక్షతన జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, నియోజక వర్గస్థాయి ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం వర్గానికి గొప్ప చరిత్ర ఉందని పాలకుర్తి చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పేందుకు సీఎం కేసీఆర్ సహకారంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని పురాతన ఆలయాలన్నింటినీ పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దేందుకు 100 కోట్లతో అబివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పాలకుర్తి ప్రాంతాన్ని టూరిజం హబ్బుగా తీర్చిదిద్దడంతోపాటు పర్యాటకుల కోసం 25 కోట్లతో హరిత హౌటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన మహా కవులైన బమ్మెర పోతన, పాల్కురికి సోమనాథుడు, వాల్మీకి మహ ర్షిలతోపాటు అనేకమంది కవులు కళాకారులను కన్న నేల పాలకుర్తి అని కొనియా డారు. టూరిజం ప్యాకేజీలో బొమ్మెర, పాలకుర్తిలో జరుగుతున్న పర్యాటక పనుల ప్రారంభానికి సీఎం కేసీఆర్ను తీసుకు వస్తానని అన్నారు. మహాశివరాత్రి సంద ర్భంగా జరిగే ఆలయ బ్రహ్మౌత్సవాల్లో పారిశుద్ధ్యన్ని పాటించాలని సూచించారు. బ్రహ్మౌత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉండే విధంగా కృషి చేయాలని, త్రాగునీటి సరఫరా పై దృష్టి పెట్టాలని, ఆలయ ప్రాంగ ణంతోపాటు పరిసర ప్రాంతాల్లో చెత్త లేకుండా చూడాలని, స్వామివారిని దర్శిం చుకునేందుకు భక్తుల క్యూలైన్ల వద్ద త్రాగునీరు ఏర్పాటు చేయాలని, జాతర నాటికి పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించా రు. మహాశివరాత్రి బ్రహ్మౌత్సవాలతో పాటు ఈనెల 26న సేవాలాల్ జయంతి వేడుకలు, మార్చిలో శ్రీరామనవమి పండుగలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కుటుంబంతో తరలిరావాలని పిలుపునిచ్చారు. భద్రాచలం తరహాలో వలి మిడిలో సీతారాముల కల్యాణాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తున్న పాలకుర్తి పంచాయతీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతరలో పారిశుద్ధ్యన్ని పాటించేందుకు క్లస్టర్లను ఏర్పాటు చేసి బాధ్యతలను అప్పగించాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆ యా శాఖల అధికారులను ఆదేశించారు. బ్రహ్మౌత్సవాల సందర్భంగా విధి నిర్వ హణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
హిందూయిజం ముసుగులో బిజెపి రాజకీయం
ఆలయాల అబివృద్ధిని విస్మరించిన బిజెపి హిందూయిజం ముసుగులో రాజ కీయం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతుందనిమంత్రిఎర్రబెల్లి ఆరోపించారు. హిందూ యిజం పేరుతో మత విద్వేషాలను రెచ్చగొడుతుంది తప్ప ఆలయాల అభివృద్ధి కోసం పైసా కూడా కేటాయించలేదని విమర్శించారు. పురాతన ఆలయాల అబివృ ద్ధికి రాష్ట్ర ప్రభుత్వంకృషి చేస్తుంటే ప్రోత్సహించాల్సింది పోను హిందూయిజాన్ని రెచ్చగొడుతున్న బిజెపి రాజకీయ లబ్ధి కోసమే ఆరాటపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీరమనేని యాకాంతరావు, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, డిఆర్డి ఎ పిడి రామ్ రెడ్డి, డిసిపి సీతారాం, వర్ధన్నపేట ఏసిపి శ్రీనివాసరావు, డిపిఓ వసంత, జెడ్పిటిసి పుస్కూరి శ్రీనివాసరావు, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, బి.ఆర్.ఎస్ మండల అధ్య క్షుడు పసునూరి నవీన్, ఆలయ ఈవో నండూరి రజిని కుమారిలతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ పాలకమండలి సభ్యులు, అర్చకులు, సేవాలాల్ ఆలయ నిర్మాణ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.