Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
ఆయిల్ ఫామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రో త్సాహం కల్పిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండ లంలోని గోపాలగిరిలో 100ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పరిశ్రమ ఏర్పాటుపై తొర్రూరు ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్యతో కలిసి రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మంగళవారం హన్మకొండలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్ రావును కలిశారు. అనంతరంపరిశ్రమ ప్రాంతం లో సీసీ రోడ్లు, బీటీ రోడ్డు ఏర్పాటు రూ.9 కోట్లు మం జూరు చేయాలని ప్రతిపాదనలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ఆయిల్ పామ్ ప్రస్తుతం 68,179 ఎకరాలలో సాగు చేయబడుతోందన్నారు.రాష్ట్రంలో ముడి పామాయిల్ ఉత్పత్తి సాలినా 45,000 మెట్రిక్ టన్నులు మాత్రమే నని,కాగా మన రాష్ట్ర జనాభాకు 3.66 లక్షల టన్నుల పామ్ ఆయిల్ అవసరమని పేర్కొన్నారు.ఆయిల్ పా మ్ సాగు చేస్తున్న రైతులు సాలినా ఎకరానికి 10-12 టన్నుల గెలల దిగుబడి సాధిస్తారని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు తెలంగాణ ప్రభు త్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు.ఈ పంట సాగుతో 4 ఏండ్ల నుంచి 30 ఏండ్ల వరకు నిరంతర ఆదాయం పొందవచ్చన్నారు.బ్యాంకుల ద్వారా రుణ సాయం అందుతుందన్నారు. హరిపిరా లలో 40 ఎకరాల్లో నర్సరీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తాను సైతం ఆయిల్ ఫామ్ పంటను సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర పంటల స్థానంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యు డు షేక్ అంకూస్, బిఆర్ఎస్ నాయకులు రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.