Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-వరంగల్
ఓరుగల్లును కాలుష్య రహిత నగరంగా తీర్చేదిదీందుకు సంఘటితంగా కృషి చేయాలని బల్దియా మేయర్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా మేయర్ గుండు సుధారాణి హాజరై మాట్లాడారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ఎనర్జీ బిల్డింగ్ కోడ్ను ప్రవేశ పెట్టడం ఆనందదాయకమన్నారు. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్, పర్యావరణ-నివాస్ సంహిత, స్మార్ట్ సిటీలు,స్మార్ట్ భవనాలు, వీధి దీపాలలో శక్తి సామర్థ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ మురుగునీటి శుద్ధి సెక్టర్లు, జీడబ్ల్యూఎంసీలో అమలు చేయుటకు చర్యలు తీసుకావాలని సూచించారు. కమర్షియల్ రెసిడెన్షియల్, భవ నాల నిర్మాణాల్లో నిబంధనలను పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. ముందుగా ప్రభుత్వ భవనాల్లో నిర్మాణ సమయంలో ఈ నిబంధనలను పాటించాలని అధికారులను సూచించారు. జీడబ్లుఎంసిలోని నీటి సరఫరా, శాని టేషన్, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రిసిటీ విభాగాల్లో, లీకేజీలను గుర్తించుటకు, ఇంధన పొదుపు, వర్మీ కంపోస్ట్ తదితర సెక్టార్లలో ఈ వినూత్న టేక్నాలజీని అమలు చే యాలన్నారు. కొత్తగా నిర్మించనున్న పరిపాలన భవనంలో ఈ టెక్నాలజీని అమలు చేయుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా ఈసీబీసీ నిపు ణులు సయ్యద్ ముజామిల్ అలీ, పవర్ పాయింట్స్ ప్రెసెంటిషన్ ద్వారా వివరిం చారు. కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ అనీసుర్ రషీద్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఈఈ సంజరు కుమార్, ఏసిపిలు శ్రీనివాస్ రెడ్డి, బషీర్, శ్రీనివాస్, ఎల గ్రీన్ బిల్డింగ్స్ కన్సల్టెంట్ ఆదిత్య, శ్రీ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.