Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు ఐద్వా 2023 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ లో తెలంగాణ సాయుధ పోరాట యోధులు మల్లు స్వరాజ్యం, వీరనారి ఐలమ్మల ఫోటోలు వుండడంఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి నలిగంటి రత్న మాల మాట్లాడారు.ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి, మహిళా రక్షణ కోసం బడ్జెట్ అంకెలకు మాత్రమే ప్రకటిస్తున్నారు.కానీ ఆ మేరకు ఖర్చు చేయడం లేదని అన్నారు. బడ్జెట్లో డ్వాక్రా, మహిళా సంఘాల పొదుపు సంఘాల వూసే లేదన్నారు. బడ్జెట్లో పేదలు నిర్మించుకున్న గుడిసె వాసులకు ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించు కోవడానికి రూ. 5 లక్షలు కేటాయించాలని ప్రభుత్వానికి సూచించామని అన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో ఐద్వా సభ్యులు ప్రత్యూష, భవాని, జ్యోతి, సునీత, అనిత తదితరులు పాల్గొన్నారు.