Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్
ఫిబ్రవరి 15 న హైదరాబాద్ ఉ ప్పల్ బగాయత్‌లో జరిగే ఆరె కుల సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణ శంకుస్థాపన సభకు భారీ ఎత్తున తర లిరావాలని ఆత్మకూర్ మండల అధ్య క్షులు గువ్వాటి సాంబయ్య, ప్రధాన కార్యదర్శి లకిడే హరీష్ పిలుపునిచ్చా రు. బుధవారం వారు మండలంలోని పలు గ్రామాలలో ఆరే కుల సంఘ నాయకులతో కలిసి కుల సంఘం ప్రతి ఇంటికి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సిరిసే చందర్రావు, తుమ్మనపల్లి రామేశ్వరరావు, తిరుమలగిరి సర్పంచ్ జిల్లా నాయకులు రంపిస మనోహర్‌రావు, గ్రామాలఅధ్యక్షులు నకాతి యుగేందర్, వాసూరి సాంబరావు, రంపిస ప్రభాకర్ రావు, మోరే రాజు, మండల గౌరవ అధ్యక్షులు చౌలపల్లి మాజీ ఎంపిటిసి ఆదర్సాని చందర్రావు, లకిడే వీరన్న,డుకిరే నాగేశ్వరరావు , కౌడగాని మహేందర్, తిప్పారపు సాంబ య్య, కుసుంబ రాజేందర్, హింగే శ్రీనివాస్, కుల బంధువులు పాల్గొన్నారు.
ఎల్కతుర్తి : ఫిబ్రవరి 15న హైదరాబాద్ ఉప్పల్ బగాయత్ లో, ప్రభుత్వం కేటాయిం చిన ఎకరం స్థలంలో ఆరె కుల సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం భారీ ఎత్తున చేయడం జరుగుతుందని అన్ని గ్రామాల నుండి ఇంటికి ఒకరుస్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆరెకుల సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షు లు సుకినే సుధాకర్‌రావు, హింగే భాస్కర్ లు, కోరారు. బుధవారం మండలంలోని చింతల పల్లి, దామెర, ఆరేపల్లి, సూరారం, గ్రామాల్లో మండల అధ్యక్షుడు కుడుతాడి రాజు ఆధ్వర్యం లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఆరె కులస్తు లందరూ ఇంటికొకరు తప్పనిసరిగా కదలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం భీమదేవ రపల్లి మండలం పలు గ్రామాల్లో, వేలేరు మండలం పీసర తదితర గ్రామాల్లో కరపత్రాలను పంపిణీ చేసి, సభను విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లానాయకులు అంబీరు శ్రీనివాస్, నరసింగం, సుకినేగోపాల్, గౌతమ్‌రావు, మాజీ సర్పంచ్ రాజేశ్వరరావు, సుక్కినే రవి, అంబిరు చందర్రావు, నరసింగము, తదితరులు ఉన్నారు.