Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీక్షా సమావేశంలో కలెక్టర్ డాక్టర్ బీ.గోపి
నవతెలంగాణ-వరంగల్
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని గర్భిణీలను చైతన్య వంతం చేస్తూ ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్ట ర్ బీ.గోపి పేర్కొన్నారు. బుధవారం వరంగల్ జిల్లావైద్య ఆ రోగ్య శాఖ కార్యక్రమాలపై కలెక్టర్ డాక్టర్ బి గోపి సమీక్షా స మావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లా డుతూ ముందుగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన లో జరుగు ప్రసవాల గురించి, సి సెక్షన్ ఆపరేషన్ల గురించి వివరంగా తెలుసుకొని తగిన సూచనలు ఇవ్వడం జరిగినది. జిల్లాలో సి సెక్షన్ల ఆపరేషన్ తగ్గించాలని ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ను పెంచాలని ఆదేశించారు. జిల్లాలో గర్భస్రావా లు జరగకుండా పిసిపిఎన్డిటి ఆక్ట్ను కఠినంగా అమలు చే యాలని సూచించారు. ఈ సంజీవిని ద్వారా జిల్లాలో ఉన్న 118 సబ్సెంటర్ల ద్వారా ఆరోగ్య సేవలందించాలని, ఎంక్వ స్ ప్రమాణాలను పెంచి జిల్లాలో ఎక్కువ పీహెచ్సీలు యూహెచ్సీలు ఆధునికరించి ఇన్క్వాస్ ద్వారా వచ్చే లాభా లను పొందాలన్నారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డా క్టర్ కె.వెంకటరమణ,అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ సుందర్ సింగ్ ,డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ గోపాలరావు, డాక్టర్ ప్రకాష్ ,ప్రోగ్రాం అధికారులు డాక్టర్ పద్మశ్రీ ,డాక్టర్ సెల్లా మధుసూదన్ ,ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నర్సింహారెడ్డి, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, రాజ్ కుమార్, స్టాటిటికల్ ఆఫీసర్ విజయలక్ష్మి ,జిల్లా ఎన్సీడీ కోఆర్డినేటర్ ప్రకాష్ రెడ్డి , ప్రతాపగిరి ప్రసాద్, డిడిఎం నితిన్ రెడ్డిలు పాల్గొన్నారు.