Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
గురుకుల విద్యార్థులు అస్వస్థత పాలైన సంఘటనపై కవరేజ్ వెళ్తున్న ఇద్దరు జర్నలిస్టులు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైయ్యారు. బుధవారం పట్టణంలోని వల్లబ్‌నగర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థత పాలై ఆసుపత్రి లో చేరిన సమాచారం మేరకు ఏబీఎన్ జర్నలిస్టు బూర వే ణు, హెచ్ఎంటీ జర్నలిస్టు గాండ్ల ప్రదీప్ కుమార్ కవరేజ్ కె ళ్లారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కవరేజ్ చేశాక వారు అక్క డి నుంచి ద్విచక్ర వాహనంపై వల్లబ్నగర్లోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల వద్దకువెళ్తుండగా మార్గ మధ్యం లో ఓ ట్రాలీ వాహనం ఎదురుగా వచ్చి ఢ కొన్నది. ఈ సం ఘటనలో ప్రదీప్ కుమార్, వేణుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు ప్రదీప్ కుమార్‌కు తీవ్ర గాయాలు అయినందున వరంగల్‌లోని ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు ప్రదీ ప్ను చేర్పించగా వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.అతని ఆరో గ్యం నిలకడగానే ఉందని చెప్పారు. నర్సంపేటలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఏబీఎన్ జర్నలిస్టు వేణుకు మో కాలికి శస్త్ర చికిత్స చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంఘటపై సమాచారం తెలుకొని వెంటనే స్పందించారు. ఆసుపత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.ఆసుపత్రిలో అయ్యే ఖర్చులన్నీ తానే చెల్లిస్తాననీ అధైర్యపడొద్దని ప్రదీప్ కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. వరంగల్‌లోని ఆసుపత్రిని జెడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ సందర్శించారు. ప్రదీప్‌ను పరమార్శించారు. వైద్యులతో ఆరోగ్య పరిస్థితి, చికిత్స విషయంపై అడిగి తెల్సుకొని ఎమ్మెల్యేకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.