Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వాహకులను ఆదేశించిన ఐబీ ఎఈ
- కొనసాగుతున్న అక్రమ నిర్మాణం
నవతెలంగాణ-హసన్‌పర్తి
శ్యామల చెరువులో అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని 55వ డివిజన్ ప్రజలు ఈ నెల 1వ తేదీన కలెక్టర్‌ను వేడుకున్నారు. నవ తెలంగాణ దినపత్రికలో ఈ నెల 2వ తేదీన ప్రచురితమైన వార్తా కథనంపై ఇరిగేషన్ అధికారులు స్పందించారు. ఈ విషయంపై స్పందించిన ఐబీ ఏఈ శ్రీనివాస్ శ్యామల చెరువు బఫర్ జోన్లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హసన్‌పర్తి మండలం భీమారం శివారు శ్యామల చెరువు బఫర్ జోన్లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను ఆయన పరిశీలించి నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే అక్రమ కట్టడాలను నిలిపివేయాలని ఆదేశించినప్పటికి సంబందిత నిర్వాహకులు బఫర్ జోన్లోనే అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో సంబందిత ఐబీ ఏఈ శ్రీనివాస్ తక్షణమే ఇందుకు సంబందించిన నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించి దీని వెనక ఉన్న ప్రజాప్రతినిదులు కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బఫర్ జోన్లో కబ్జాకు తెర
భీమారం శివారు శ్యామల చెరువు బఫర్ జోన్లో హెల్త్ సెంటర్ నిర్మాణం చేపట్టి దీన్ని సాకుగా చూపి మిగతా స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శ్యామల చెరువు బఫర్ జోన్లో అక్రమ కట్టడాలకు వంతపాడేందుకు బఫర్ జోన్లో హెల్త్ సెంటర్ నిర్మాణం చేపట్టినట్లు పలువురు స్థానికులు సంబంది ఐబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై సంబందిత ఐబీ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి నివేధికను జిల్లా కలెక్టర్‌కు అందజేసి బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.