Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలో నిన్న ఎమ్మెల్యే రాజయ్య ఫోటోకాల్ పాటించకుండా సర్పంచ్లను అగౌరపరిచారని సర్పంచులు చెట్ల స్వరూపరాణి, భూపాల్ రెడ్డి, మల్లేశం, భాస్కర్,చిన్న యాదమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని నెల్లుట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజయ్య గ్రామాలలో అభి వృద్ధి పనులు చేపట్టకుండానే కమీషన్లకు పాల్పడుతూ అభివృద్ధికి ఆటంకం కలిగి స్తున్నాడని కడియం శ్రీహరి వర్గీలమైన మమ్మల్ని కించ్చ పరుస్తూ ఎమ్మెల్యే ఎంపీపీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సహకారంతోనే గ్రామాలను అభివృద్ధి చేశారు. సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షు డు గణపతి ఆయా గ్రామాల్లో స్థానిక సర్పంచులు లేకుండా అభివృద్ధి కార్యక్రమం లో పాల్గొనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తోటి సర్పంచులను అవమానించడం అన్నారు. ఈ సమావేశంలో సర్పంచులు పెళ్లి దేవేంద్ర, మోహన్ రెడ్డి, తుంగ స్రవంతి, నాగరాజు, నాయకులు సోమిరెడ్డి,సోమయ్య పాల్గొన్నారు.