Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టి సీసాలో బంధించాలి... లేకపోతే తట్టుకోలేం
- టీపీసీసీ ఆధ్యక్షడు రేవంత్ రెడ్డి చిట్ చాట్
నవతెలంగాణ-మహబూబాబాద్
కేసీఆర్ భూతం లాంటివాడు అని... పట్టి సీసాలో బంధించాలని... లేకపో తే తట్టుకోలేము అని... టీపీసీసీ అధ్యక్షుడు అనుమల రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జోడూ యాత్రలో భాగంగా మహ బూబాబాద్ నియోజకవర్గంలో విలేక రులతో మాట్లాడారు.2024 జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్పాటు అవుతుంది అని, మొదటి సంతకం పోడుభూముల సమస్య పరిష్కరిస్తాం అని అన్నారు. కెసి ఆర్ లాక్కున్న పోడు భూములన్నిటికీ తిరిగి పట్టాలు ఇస్తామని అన్నారు. పొంగు లేటి సిద్ధాంతం మంచింది... అయన ఎంచుకున్న బీజేపీ విధానం సరైంది కాదు అని అన్నారు.
పొంగులేటి కాంగ్రెస్లోకి వస్తే ఆహ్వానిస్తాం...
ఇప్పటికే బీజేపీలో చేరిన వారు ఇబ్బందులు పడుతున్నారు. బిజెపి ప్రభుత్వం లో చేరిన ప్రజాప్రతినిధులు ఇప్పటికే మనస్థాపంతో కుంగిపోతున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న కేసిఆర్ ప్రభుత్వా నికి రోజులు దగ్గర పడ్డాయి. నేను కేసులకు భయపడను... నాకు కొత్త ఏమి కాదు అని అన్నారు. ప్రజలకు ప్రవేశం లేని అమరవీరులను ఆదుకొని ప్రగతి భవన్ ఎందుకని..? దాన్ని కూల్చివేస్తామని..? తప్పేంటి అని ప్రశ్నించారు. జేఏసీ అంటే నే జాయింట్ యాక్షన్ కమిటీ అన్నారు. కెసిఆర్కి చేతకాదనే కోదండరాంను జేఏసీ చైర్మన్ చేశారని అన్నారు. ఉద్యమ సమయంలో జానారెడ్డి కాళ్ళమీద పడ్డ వ్యక్తి కేసి ఆర్ ఇప్పుడు తానే సాధించినట్లు విర్రవీగుతున్నాడని విమర్శించారు. తెలంగాణ పదాన్ని అసహ్యించుకున్న వాళ్ళను కెసిఆర్ ప్రగతి భవన్లో కూర్చో బెట్టిండు... మంత్రి పదవులు ఇచ్చిండని విమర్శించారు.
90 శాతం తెలంగాణ ద్రోహులు మంత్రులుగా ఉన్నారని అన్నారు. రసమ యి బాలకిషన్ ఉద్యమకారుడు, విద్యావంతుడు మంత్రిని చేయొచ్చు కదా..? అని ప్రశ్నించారు. ఏబీసీడీలు రాని ఎర్రబెల్లిని కులం చూసుకొని మంత్రిని చేశారు. అని ఆయన మంత్రిత్వ శాఖ పేరును తప్పులు లేకుండా రాయడం కూడా రాదు అని విమర్శించారు. కోవర్ట్ ఆపరేషన్లలో దయాకర్ రావు ఎక్స్పర్ట్ అని అందుకే మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేల పై సీబీఐ విచారణ జరిపించాలి. కెసిఆర్ రాష్ట్రంలో 3 వేల లిక్కర్ షాపులు... 60 వేల బెల్టు షాపులు ఏర్పాటు చేసి ప్రజలను తాగుబోతులను చేశాడు అని విమర్శించారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతలు అప్పులపాలై సూసైడ్ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. ప్రాజెక్టు కోసం లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టారని, ఒక్కొక్క జిల్లాకు వెయ్యి కోట్లు ఇస్తే 33 వేలకోట్లతో నీటి సమస్య పరిష్కారం అయ్యేది కదా..? అని ప్రశ్నించారు. కెసిఆర్ పాలన కమిషన్ల పాలనని అని విమర్శించారు.