Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
భూ సమస్యలపై రైతుల దరఖాస్తులను పరిశీ లించి సమస్యలను పరిష్కరిస్తామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ బి.గోపి అన్నారు. మండలంలో పర్య టన చే సి రైతుల భూసమస్యలు తెలుసుకుంటామన్నారు. మండలంలోని కన్నరావుపేటలో బుధవారం నిర్వ హించిన గ్రామసభకు హాజరైన కలెక్టర్ గోపి, అదన పు కలెక్టర్ కోట శ్రీవత్స రైతుల దరఖా స్తులను పరిశీ లించి భూ సమస్యలను తెలుసుకొని రైతులతో మా ట్లాడి పాత పట్టాదారు పాసు పుస్తకా లను పరిశీ లించి గతంలో చేసిన సర్వే వివరాలు పరిశీలిస్తూ మిగులు పట్టాలు చూసి సమస్యలను పరిష్కరి స్తామని రైతులకు హామీ ఇచ్చారు.మండల కేంద్రం లోని కంటివెలుగు కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి చేప ట్టి అందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని అవసర మైన వారికి అద్దాలు అందించాలని సిబ్బందికి సూ చించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథ మిక పాఠశాల, ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మనఊరి-మన బడి పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని సూచించారు. ప్రాథమిక పాఠశాల పనులను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశా రు.ఈకార్యక్రమంలో ఆర్డీఓ మహేందర్, తహశీల్దార్ దూలం మంజుల, ఎంపీడీవో విజరు కుమార్, జిల్లా అధికారులు, సర్పంచ్లు తంగెళ్లనిర్మల, నానబోయిన రాజారాం, పాఠశాలల నోడల్ ఆఫీసర్ ఏ రామస్వా మి, వైద్యసిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయులు, మం డల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.