Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భీమదేవరపల్లి
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఏఐకేఎస్ హనుమకొండ జిల్లా ఉపాధ్య క్షులు జుర్రు సంపత్ డిమాండ్ చేశారు. మండలంలోని కొత్తకొండ విద్యుత్ సబ్స్టే షన్ ఎదుట బుధవారం నిరసన తెలిపారు ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ వేళా పాలాలేని త్రీఫేస్ విద్యుత్ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రభుత్వం చెపుతున్నట్లుగా 24గంటల నాణ్యమైన విద్యుత్తును రైతులకు అందిం చాలన్నారు. గృహ వినియోగ చార్జీలు పెంచడం వల్ల పేదల ఇబ్బందులు పడుతు న్నారని అన్నారు. 100 యూనిట్ల వరకు పేదలకు ఉచిత విద్యుత్ అందడం లేద న్నారు. ఏసీడీ చార్జీలు ప్రవేశపెట్టడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఏసిడి చార్జీలు తగ్గింపుతోపాటు గృహ వినియోగ చార్జీలు తగ్గించాల న్నా రు. విద్యుత్ సంస్థకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.37 వేల కోట్లు ఇవ్వాలన్నారు కా ర్పొరేట్ సంస్థల వద్ద ఉన్న పెండింగ్ బిల్లులను తక్షణమే వసూలు చేయాలనీ డి మాండ్ చేశారు. అనంతరం ఏఈకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ జిల్లా కమిటీ సభ్యురాలు మాసని స్వరూప నాయకులు నీల బీరయ్య, సుందర్ లాల్, పోతిరెడ్డి లచ్చవ్వ, బుర్ర రాజశ్రీ, నీలం కొమురయ్య, శారద, ఎండి కాజా తదితరులు పాల్గొన్నారు.