Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభా గం జిల్లా చైర్మన్, వరంగల్ పార్లమెంటు నాయకులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ జిల్లా కలెక్టర్ సిక్తా ప ట్నాయక్ కలిసి దళితుల భూముల విషయమై కలె క్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. దళి తులకు మూడెకరాల భూమి ఇవ్వాలని అసెంబ్లీ సాక్షి గా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్చేసిన వాగ్దానం ప్రకా రం హనుమకొండ జిల్లా భూమిలేని ఎస్సీ కుటుంబా ల అందరికీ, మొత్తానికి భూమిలేని వారి నుండి మొ దలుకొని అరకొర భూమి ఉన్న వారి వరకు సరి అగు సర్వే విధానంతో భూములను ఇషఉ్య చేయాలని కలెక్టర్కోరారు. ఎస్సీ కుటుంబాల ప్రైవేటు భూముల ను అసైన్డ్ భూములను సైతం కబ్జాదారుల కబంధ హస్తాల నుండి పరిరక్షించే విధంగా చర్యలు తీసుకో వాలని కోరారు. ముఖ్యం గా ప్రస్తుత రాష్ట్ర ప్రభు త్వం అసైన్డ్ భూములను వివిధ రకాలుగా స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, పట్టణ, పల్లె ప్రకతి వనాలు తదితర పేర్లతో తప్పు తో వలో కుటుంబ సభ్యుల అ నుమతి లేకుండా మరల్చు తోంది వీటిని తగు చర్యలు తీసుకొని వారించాలని కో రగా సానుకూలంగా స్పం దించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమిలేని నిరు పేదలకు భూములు అందిస్తామని దళితుల భూము లు కబ్జాచేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటా మని చెప్పిన కలెక్టర్ ధన్యవాదాలు అని డాక్టర్ రామ కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రె మహేందర్, కిరణ్, మహేష్, యాకూబ్, తదితరులు పాల్గొన్నారు.