Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీటీసీ గుడాల అరుణ
నవతెలంగాణ-మహదేవపూర్
రైతులకు కోతల్లేని నిరంతర విద్యుత్ ఇవ్వాలన జెడ్పీటీసీ గుడాల అరుణ కోరారు. బుధవారం మహదేవపూర్ మండల కేంద్రంలోని విద్యుత్తు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగ దారుల సమస్యల పరిష్కార వేదికలో ఫోరం చైర్మన్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేసి ఆమె మాట్లాడారు. పంట చేతికి వచ్చే సమయంలో కరెం టు కష్టాలు ఎదురవుతున్నాయన, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కరెంటు కటింగ్ లేకుండా ఇవ్వాలని, ఏ సమయంలో ఇస్తారో స్పష్టం చేయాలన్నారు. చండ్రుపల్లి గోదావరి వద్ద డీటీఆర్-60కేవీ ట్రాన్స్ఫార్మర్ను తీసుకెళ్లి 25కేవీ ట్రాన్స్ఫార్మర్ అమర్చారని, దీంతో విద్యుత్ సరిపోవడం లేదన్నారు. వెంటనే 63కేవీ ట్రాన్స్ఫార్మర్ అమర్చాలన్నారు. కాటా రానికి మంజూరీ చేసిన ఈఆర్ఓ ఆఫీసు పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. రైతులకు త్రి ఫేస్ విద్యుత్ నిరంతరం సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా నాయకులు ప్రజాప్రతినిధులు డి నాగరాజు, ఏఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.