Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణికుంట్ల మహేష్
నవతెలంగాణ-భూపాలపల్లి
జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు వారికే కేటా యించాలని ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకో వాలని ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణి కుంట్ల మహేష్ డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు చేపట్టిన నిరవధిక దీక్షలు బుధవారం ఏడో రోజు కొన సాగాయి. ఈ సందర్భంగా జర్నలిస్టుల దీక్షకు సంఘీ భావం తెలిపి ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం లోని పుల్లూరి రామయ్యపల్లి శివారు సర్వే నెంబర్-141లో 50మంది జర్నలిస్టులకు 2013లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పట్టాలు ఇచ్చా రని తెలిపారు. కానీ, కలెక్టర్ పట్టాలను రద్దుచేస్తూ నోటీసులు ఇవ్వడం సరైంది కాదన్నారు. జర్నలిస్టులు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బోరు కూడా వేశారని విద్యుత్ మీటర్లు కూడా అమర్చారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ కార్యాలయం ముందు 80 ఫీట్ల రోడ్డును వదిలి ఇళ్ల స్థలాల్లో కొంత మంది జర్నలిస్ట్లు లక్షలు ఖర్చు పెట్టి ఇంటి నిర్మా ణలు చేశారని తెలిపారు. ఇప్పుడు ఉన్నట్టుండి వారి నోట్లో మట్టి కొట్టినట్టు కలెక్టర్ ఇళ్ల పట్టాలను రద్దు చే యడం హేయమైన చర్య అన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి పట్టాల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే జర్నలిస్టుల పోరాటంలో ముందుండి పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి శీలపాక హరీష్, జిల్లా అధికార ప్రతినిధి మేకల ఓంకార్తోపాటు జర్నలిస్టులు పాల్గొన్నారు.