Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నిరసనలు
నవతెలంగాణ-నర్సంపేట
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తగిన కేటా యింపులు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఒకేషనల్ కళా శాల ఎదుట విద్యార్థులు రాష్ట్ర బడ్జెట్‌పై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లా డుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. పాఠ శాలలు, కళాశాలు, హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా రన్నారు. ప్రభుత్వం కేజీటూపీజీ విద్య అందిస్తున్నా మని గొప్పలు చెబుకుంటున్నా ఆచరణలో అందుకు విరుద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2,90, 396 లక్షల కోట్లలో కేవలం రూ.19,093 కోట్ల కేటాయింపులకే (6.57శాతం) పరిమితం చేయడం విద్యారంగం పట్ల ప్రభుత్వ వైఖరి ఎంటో అర్థమౌ తుందన్నారు. పాఠశాల విద్యాశాఖకు కేవలం రూ. 16,092 కోట్లు(5.54శాతం) ఉన్నత విద్యకు రూ.3001 కోట్లు (1శాతం) కేటాయించారని అన్నారు. మొత్తం బడ్జెట్ రూ.2,90,396 కోట్లలో కనీసం 10శాతం నిధులు కూడా కేటాయించ లేదన్నారు. చాలీచాలని నిధుల కేటాయింపుతో ప్రభుత్వ విద్యారంగం ఏవిధంగా కొనసాగుతుం దన్నారు. మరో వైపు యూనివర్సిటీలో ఉద్యోగులకు సరిపడా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. మెస్ చార్జిలు పెంచకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్య మైన భోజనం అందని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేటాయించిన నిధుల్లో నుంచి పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టిన దాఖలాలు లేవన్నారు. స్కాల ర్షిప్లు, ఫీజురీయాంబర్స్మెంట్లు చెల్లించక పెండింగ్‌లో ఉండిపోయయన్నారు. ఇప్పటికైన వెంటనే ప్రభుత్వం విద్యారంగానికి నిధుల కేటాయిం పుల్లో ప్రాధన్యతనివ్వాలని లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా సహాయ కార్యదర్శి రాకేష్ మౌనిక, రమ్య, సంగీత, మౌనిక రాజు, శ్రీనివాస్ కృష్ణ, మురళి తదితరులు పాల్గొన్నారు.
డీివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో...
మట్టెవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ యువతకు ఆన్యాయం చేసేలా ఉన్నాయని డీవైఎఫ్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి ధర్మారపు సాంబమూర్తి మండిపడ్డారు. ప్రభుత్వాల బడ్జెట్‌కు వ్యతిరేకంగా బుధవారం డీివైఎఫ్‌ఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయుడు పంపు జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి ఎప్పటిలాగే బడ్జెట్లో ఆరకొర నిధుల కేటాయింపులు చేశారని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లోనూ తక్కువ నిధుల కేటాయింపుతో అన్యాయం జరిగిందన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృత హామీ నెరవే ర్చకుండా బడ్జెట్ కేటాయింపులు చేయకుండా నిర ్లక్ష్యం చేశారన్నారు. ఉద్యోగాల కోసం 28 లక్షల40 వేల మంది నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలకు పట్టిన గతే బీజేపీ, బీఆర్ఎస్లకు పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బొక్క చరణ్, బేతి రాజేష్, దుడుం రాజేష్, నరసింహ రాజు, నవీన్, అనూష, రజియా, పూజ తదితరులు పాల్గొన్నారు.