Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెయింటెనెన్స్ లేక రైతులకు వెతలు
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని మల్లూరువాగు మధ్యతరహా ప్రాజెక్టు ప్రధాన కుడి కాలువకు డి వన్ ప్రాంతంలో గండిపడి ప్రాజెక్టులోని నీరు వథాగా పోతోంది. ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు సామర్థ్యం మేరకు నిండు కుండలా మారి మత్తడి పడింది. దీంతో ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలు వలతో పాటు డి వన్, డి టూ కాలువలు నిండా పారుతూ ఆయకట్టులోని సుమారు పది వేల ఎకరా లకు రెండు పంటలకు సరిపడా సాగునీరు అందు తుంది. సంబంధిత ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు కాలవలను మెయింటెనెన్స్ చేయకపోవడం వారి పర్యవేక్షణ లేక పోవడంతో ప్రధాన కాలువలకు అక్కడక్కడా గండ్లు పడి సాగునీరు వధాగా పోతూన్నాయని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. కుడి కాలువ డి వన్ ప్రాంతంలో గండి పడి సాగు నీరంతా వధాగా పోతుందని దీంతో పూడరెడుపల్లి, నర్సింహాసాగర్, శనిగకుంట, వాగొడ్డుగూడెం, లక్ష్మీనర్సాపురం, రాజుపేట తదితర గ్రామాలకు చెందిన సుమారు 3 వేల ఎకరాలకు రబీ వరి పంట లతోపాటు మిర్చీ, పత్తి వంటి మెట్ట పంటలకు సాగు నీరు అందకుండా పోతుందని రైతులు వాపోయారు. 20 రోజులుగా విషయాన్నిఇరిగేషన్ అధికారులకు తెలిపినా స్పందించకపోవడంతో బుదవారం ఆయ కట్టు రైతులు ప్రాజెక్టు ప్రధాన కాలువ గండి పడ్డ ప్రాంతంతో జేసీబీల సహాయంతో తాత్కాలిక మర మ్మత్తులు చేసుకున్నట్లు తెలిపారు. అధికారుల పర్య వేక్షణ కాలువల మరమ్మత్తులు చేయకనే ప్రధాన కా లువకు గండ్లు పడుతున్నాయని ఇప్పటికైనా అధికా రులు స్థానికంగా ఉండి రైతులకు రెండు పంటలకు సాగునీరుందించాలని డిమాండ్ చేస్తున్నారు.