Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసు నమోదు చేయాలని ఫిర్యాదుల వెల్లువ
- నిరసనలకు శ్రీకారం...
- రేవంత్ వ్యాఖ్యలకు సీతక్క మద్దతు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి 'హాత్ సే హాత్ జోడో అభియాన్' పాదయాత్రలో ప్రగతిభవన్‌ను గ్రానైడ్లతో పేల్చాలని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతు న్నాయి. ములుగులో పాదయాత్ర నేపథ్యంలో జరిగిన బహి రంగ సభలో ఆయన మాట్లాడుతూ... 10 ఎకరాల్లో 150 గదులతో నిర్మించిన ప్రగతిభవన్ గడీలను తలపిస్తుం దని, ప్రజలకు ఉపయోగం లేని ప్రగతి భవన్‌ను నక్సలైట్లు గ్రానైడ్ లతో పేల్చిన తప్పు లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ములుగు పోలిస్ స్టేషన్లో బీఆర్ఎస్ ములుగు మండలం అధ్యక్షులు బాదం ప్రవీణ్ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చే యాలని ఫిర్యాదు చేశారు. రాష్ట్ర డీజీపీకి రైతు బంధు సమితి అధ్యక్షులు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డిపై పలు పోలిస్స్టేషన్లలో కేసులు నమోదయ్యే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నర్సంపేటలో నిరసనలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం ఉదయం రేవంత్‌రెడ్డి ములుగు జిల్లా పాలంపేటలో ప్రారంభించడానికి ముందు రామప్ప దేవాలయంలో రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం ఆయన పాదయాత్రను ప్రారంభించి రాత్రి ములుగు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భం గా జరిగిన కూడలి సమావేశంలో రేవంత్‌రెడ్డి ప్రగతి భవ న్ను 10 ఎకరాల్లో 150 గదులతో నిర్మించారని, అందులోకి ఎప్పుడైనా మీరు వెళ్లారా ? అంటూ ప్రజలను ప్రశ్నించారు. లేదు అంటూ ప్రజలు సమాధానమి చ్చారు. ప్రగతి భవన్ ఒకనాటి గడీని తలపిస్తుందని, ప్రజలకు పనికిరాని ప్రగతి భవన్‌ను నక్సల్స్ గ్రానైడ్లతో పేల్చిన తప్పులేదన్నారు. ఈ వ్యా ఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. వెంటనే రేవంత్‌రెడ్డి పై కేసు నమోదు చేయాలని కోరా రు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ని రసనగా ఆందోళన కార్యక్రమాలకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన ్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపుని వ్వడం తో నర్సంపేట తదితర మండలాల్లో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను బీఆర్ ఎస్ నేతలు దహనం చేశారు. నర్సం పేట నియోజకవర్గంలోని నర్సం పేట, ఖానాపూర్, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లో 'పెద్ది' పిలుపు మేరకు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.
రేవంత్ వ్యాఖ్యలను సమర్ధించిన సీతక్క
ప్రగతిభవన్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ములుగు ఎమ్మెల్యే సీతక్క సమర్ధించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను బిఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించడం, రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మహబూబాబాద్ నియోజకవర్గం కేసముద్రం మండలంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు విన్న రేవంత్‌రెడ్డి పేదలకు ఇంటి స్థలాలు, ఇండ్లు ఇవ్వకుండా పదెకరాలలో కోట్లాది రూపాయలను వెచ్చించి ప్రగతిభవన్ కట్టడం, అందులో ప్రజలు వెళ్లడానికే అనుమతి లేకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంలో భాగంగానే ఆ మాటలన్నార న్నారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉంటే ఏంటి ? లేకపోతే ఏంటి ? అన్నారన్నారు. గతంలో నక్సల్స్ ఎజెండానే మా అజెండా అని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ కోసం ఉద్యమించిన కవులు, కళాకారులు, ఉద్యమకారులపై కేసులు పెట్టడం, ఎన్కౌంటర్లు చేయడం జరిగిందన్నారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం, తిట్టడం మాకు దీవెనలని సీతక్క వ్యాఖ్యానించారు.