Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజకవర్గానికి రిజర్వాయర్లు వైఎస్సార్ ఘనత
- ఇద్దరూ ఉపముఖ్యంత్రులైనా అభివృద్ధి గుండు సున్నా
- వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
నవతెలంగాణ-వరంగల్
సీఎం కేసీఆర్ ఉద్యమం పేరిట అధికారంలోకి వచ్చి, ఇచ్చిన హామీల్లో ఒక్క టైనా నేరవేర్చకపోగా, మిగులు బడ్జెట్ గల రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా చేసిన సీఎం కేసీఆర్ మాటల్ని మరోసారి నమ్మి మోసపోవద్దని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన మహాప్రస్థానం పాద యాత్ర 3600 కిలోమీటర్లకు వచ్చింది. బుధవారం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు కేసీఅర్ ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని మండిపడ్డారు. ప్రజలకు కేసీ అర్ వెన్నుపోటు పొడిస్తే, తెలంగాణా గడ్డకు సేవ చేయాలని, హామీల రూపంలో కేసీఆర్ చేసిన మోసాలను బయట పెట్టేందుకే పార్టీ స్థాపించానని స్పష్టం చేశారు. వైయస్సార్ హయాంలో బడుగు బలహీనర్గాలకు, విద్యార్థులకు, రైతులకు మేలు జరిగే పలు పథకాలు రూపొందించారన్నారు. నియోజక వర్గానికి రిజర్వాయర్లు అందించి, లక్షన్నర ఎకరాలకు సాగునీరందించిన ఘనత వైఎస్సార్ దే అన్నారు. నియోజక వర్గంలో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం ఇద్దరూ ఉపముఖ్య మంత్రిగా ఉండి చేసిన అభివృద్ధి గుండు సున్నాని అన్నారు. వీరికి తీరిక లేదట.. రాసలీలల రాజయ్యని ఒకరంటే, ఎన్కౌంటర్ల కడియం అని పోటాపోటీగా విమ ర్శలు చేసుకుంటూ, కనీసం ప్రజల సోయి లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. కడియం మంత్రిగా 14ఏండ్లుగా ఉండి, ఒక్క డిగ్రీ కళాశాల తేలేదని, ఉచిత సల హాలు మాత్రం ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే రాజయ్య కేసీఆర్ దేవుడనీ, తాను పూజారిని అంటున్నాడు. కేసీఆర్ రాష్ట్రానికి 420 అయితే, నియోజక వర్గం లో రాజయ్య 420గా వర్ణించారు. ఇద్దరూ డబల్ నాయకులున్నా ఇక్కడ డబల్ అభివృద్ధి చేయాలిగానీ,ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి, గాడిదలు కాస్తున్నా రనీ ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో మద్దతుగా నిలిచి, ప్రజల గుండెల్లో నిలిచి న వైఎస్సార్ బిడ్డగా తనను ఆశీర్వదించాలని, అధికారంలోకి వస్తే మళ్లీ వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తామన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి చల్లా అమరేందర్ రెడ్డి, నియోజక వర్గ ఇంచార్జీ సంఘాల యిర్మియా, గాయకుడు ఏపూరి సోమన్న, జయపాల్ రెడ్డి, ఊరడి శ్రీనివాస్ పాల్గొన్నారు.