Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్
నవతెలంగాణ-మహబూబాబాద్
గత సంవత్సరం మార్చి 15న అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుండి మధ్యా హ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాలను అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ మిడ్డేమీల్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా విస్తత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అను గుణంగా మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలని సిఐటియు ఆధ్వర్యం లో చేపట్టిన పోరాటాల వలన రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి నుండి 3 వేల రూపాయల కు పెంచుతూ ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని తెలిపారు. అనేక సంవత్స రాలుగా అతి తక్కువ వేతనాలతో, అప్పులు తెచ్చి వంటలు చేసి పెడుతున్న మధ్యా హ్న భోజన కార్మికుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం మార్చి 15న అసెంబ్లీలో ముఖ్యమంత్రి వేతనాల పెంపు ప్రకటన చేశారన్నారు. ఈ నెల 6వ తేదీన విడుదల చేసిన జివో నెంబర్ 8లో వేతనాల అమలు గురించి స్పష్టత లేదన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన నాటి నుంచి అమలు చేయాలని అదేవిధంగా కోడిగుడ్లను, గ్యాస్‌ను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సమ్మేట రాజ మౌళి, శ్రామిక మహిళా జిల్లా కో కన్వీనర్ తోట పుష్ప, మిడ్డేమీల్ వర్కర్స్ యూని యన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.రుజన్య, ఆర్.ధనలక్ష్మీ జిల్లా నాయకులు యాకమ్మ, ఉపేంద్ర, కళమ్మ, మమత, ఉమ, రాణి, ప్రమీల, పద్మ, జయమ్మ, దివ్య, నాగమణి, రేణుక తదితరులు పాల్గొన్నారు.