Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గూడూరులో మహబూబాబాద్ ప్రొహి బిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, బి.కిరణ్ గారి ఆధ్వర్యంలో 7 వాహనాలకు బుధవా రం బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. దీనిలో 7 వాహనాలు బహిరంగ వేలంలో ప్రభుత్వానికి అమ్మకం ద్వారా 3,36,600 దీనికిగాను జిఎస్టి ద్వారా 60,588 మొత్తంగా 3,97,188 ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని తెలిపారు. వాహనాల బహిరంగ వేలం కార్యక్రమంలో గూడూరు, నర్సంపేట, హనుమ కొండకి చెందిన సుమారు 40 నుంచి 50 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, శ్రీ బి కిరణ్, గూడూరు సిఐ ఎన్. బిక్షపతి, ఎస్సై జయశ్రీ, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.