Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అద్యక్షా, ప్రధానకార్యదర్శి సత్యనారాయణ, యాకూబ్‌రెడ్డి
నవతెలంగాణ - ములుగు
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే ఏకైక సంఘం పీఆర్టీయూ అని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు దేవులపల్లి సత్యనారాయణ, వేం యాకూబ్‌రెడ్డి తెలిపారు. పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం జిల్లా విధ్యాదికారి కార్యాలయంలో సామల యాదగిరి చిత్రపటానికి పూలమాలేసి వేడుకలు ప్రారంభించారు. సంఘం పతాక ఆవిష్కరణ అనంతరం ఉపాధ్యాయులను ద్దేశించి వారు ప్రసంగించారు. 1971 లో ఫిబ్రవరి 9 న ప్రారంభించబడిన సంఘం యాభై సంవత్సరాల కాలంగా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అనేక జిఓ లను తెచ్చిందని గుర్తుయ చేశారు. భవిష్యత్తులో అనేక జిఓ లను తెచ్చేది కూడా పీఆర్టీయూ సంఘమే నని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వేం యాకూబ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో పిఆర్సి 30 శాతం ఫిట్మెంట్, ఈహెచ్ఎస్ కార్డ్స్ , ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ అన్ని పీఆర్టీయూ ద్వారానే సాధించబడ్డాయని అన్నారు. అనంతరం జిల్లాలోని తొమ్మిది మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో కలిపి 7 గురు విశ్రాంత ఉపాధ్యాయులు సున్నం రాజిరెడ్డి, సుంకరి సంపత్,అజ్మీర సమ్ములు,బాసాని రామ్మూర్తి, మిద్దమీది సాంబయ్య,ఎండి కుతుబుద్దీన్, చాగర్ల ఐలయ్యను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాధ్యులు చెరుకుల ధర్మయ్య ,సానికొమ్ము ముకుందరెడ్డి, గోవిందరావుపేట అధ్యక్షులు కణతల నాగేశ్వర్ రావు,ప్రధానకార్యదర్శి పాడ్య తులసీరాం, ములుగు మండల అధ్యక్షులు కంచు ప్రభాకర్,ప్రధాన కార్యదర్శి పిట్టల మల్లయ్య, వెంకటపూర్ మండల అధ్యక్షులు కోకిల శ్రీరంగం, ప్రధానకార్యదర్శి అనిచెర్ల రాజయ్య, తాడ్వాయి ప్రధానకార్యదర్శి తాటి దేవి వరప్రసాద్,ఏటూర్ నాగారం ప్రధాన కార్యదర్శి లయీమ్ పాల్గొన్నారు.