Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
నేటి నుంచి 25 వరకు ములుగు జిల్లాలో 88 కేంద్రాల్లో బీజేపీ శక్తి కార్యాలయం సమావేశాలు నిర్వహిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లా పార్టీ కార్యలయంలో గురువారం సమావేశం ఏర్పాటు చేసి భాస్కర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ పాలన అంతం చేయడానికి గ్రామ గ్రామాన బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఉద్యమకారుల ఆశయాలను నట్టేట ముంచారన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంతో నిర్మాణమైన జాతీయ రహదారులు తప్ప మిగతా రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ధరణి పేరుతో రైతుల్ని గోసపెడుతున్నారని అన్నారు. కేంద్ర నిధుల్ని దారి మళ్లిస్తూ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఉప ఎన్నికలు వచ్చిన నియోజకవర్గాల్లో మాత్రమే అభివద్ధి పనులు చేస్తూ స్వార్థపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్, ఇసుక తదితర మాఫియాలన్నింటిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో సహా మంత్రుల ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకుల ప్రత్యక్ష ప్రమేయం ఉందన్నారు. అసెంబ్లీ కన్వీనర్ సిరికొండ బలరాం, తెలంగాణ పాలసీ రీఛార్జ్ ఇంచార్జి భూక్య రాజునాయక్, వెంకటాపూర్ మండల అధ్యక్షులు భూక్య జవహర్ లాల్, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్, ములుగు మండల నాయకులు బైకని మహేందర్, శ్రీదర్ తదితరులు పాల్గొన్నారు.