Authorization
Wed April 23, 2025 06:22:00 pm
నవతెలంగాణ - వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
చిల్పూర్ మండల కేంద్రంలో శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివద్ధికి నిధులు మంజూరు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డిని స్టేషన్ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, ఆలయ ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు తో కలిసి గురువారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈమేరకు ప్రసిద్ధి గాంచిన బుగులు వెంకన్న ఆలయ చరిత్ర, రాష్ట్ర మంతటా వ్యాప్తి చెందుతుందని, రెండో తిరుపతిగా మరింత ప్రఖ్యాతి పొందుంతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దష్టికి తీసుకెళ్లి, నిధులు మంజూరు అయ్యేట్లుగా చొరవ చూపాలని, అలాగే నియోజక వర్గంలోని ఆలయాలను తీర్చిదిద్దేందుకు కషిచేయాలని కోరినట్లు తెలిపారు.