Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన జాతీయ మానవ హక్కుల కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య మాతృమూర్తి వెంకటమ్మ మరణించింది. ఆమె కుమా రులు భద్రయ్య, అతని సోదరుడు రవిని కుటుంబ సభ్యులను గురువారం పలువురు నేతలు పరామర్శించారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బొట్ల కార్తీక్, ఉపాధ్యక్షులు అన్నం మోహన్ కుమార్, ములుగు మండల అధ్యక్షులు శాగంటి రమేశ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పెట్టేం రాజు, జాతీయ సేవారత్న అవార్డు గ్రహీత పాలకుర్తి సూరయ్య, దొమ్మటి రాజు, సీపీఐ ములుగు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జంపాల రవీందర్, సీపీఐ వెంకటాపూర్ మండల కార్యదర్శి బండి నర్సయ్య, పాలంపేట సర్పంచ్ డోలి రజిత శ్రీనివాస్, కేశవాపూర్ సర్పంచ్ కొయ్యల జయలక్ష్మి భద్రయ్య, ఎన్హెచ్ఆర్సి ములుగు జిల్లా అధ్యక్షులు రాజశేఖర్నాయక్ పరామర్శించారు.