Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
పీఆర్టీయూ ఆవిర్భవించి నేటికీ 52 వసం తాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని తేజస్వి గాంధీ కాలేజ్ ఆవరణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రేగూరి సుభాకర్ రెడ్డి సంఘ పతాకాన్ని ఘనంగా ఆవిష్క రించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్, ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం కొరకు ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబా ద్ ప్రాంతానికి చెందిన సంఘ ఫౌండర్ అధ్యక్షులు కీ''శే'' సామల యాదగిరి స్థాపించిన పంచాయ తీరాజ్ ఉపాధ్యాయ సంఘం 1971 ఫిబ్రవరి 9 నుండి అంచలంచలుగా పంచాయతీరాజ్ ఉపా ధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనేక హక్కులను సాధించుకున్న సంఘం పంచాయతీ రాజ్ ఉపాధ్యాయ సంఘం అని, నేడు ప్రభుత్వ ఉపాధ్యాయులు పొందుతున్న అన్ని హక్కులను సౌకర్యాలను పంచాయితీ రాజ్ ఉపాధ్యాయులకు సాధించిపెట్టిన ఘనత పీఆర్టియు దేనని అన్నారు. సుమారు 75 వేల ఉపాధ్యాయుల శాశ్వత సభ్యత్వం కలిగి ఉపాధ్యాయ సంఘాలకు దశ దిశను నిర్దేశిస్తున్న ఏకైక సంఘం పీఆర్టియు అని వివరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి నాయకత్వంలో సంఘం ప్రభు త్వంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ అనేక అపరిచిత సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నదన్నారు. ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకొని సంఘ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కుసుమ కష్ణమోహన్, తంగేళ్ల రాజిరెడ్డి, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు బిల్లా విజయ జిల్లా కార్యవర్గ సభ్యులు సందే శ్రీ బాబురావు, స్వామి, భూపాలపల్లి మండల ప్రధాన కార్యదర్శి కొండపర్తి హరిప్రసాద్, బాధ్యులు రమేష్ వసుదప్రియ, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.