Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
నవతెలంగాణ - వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
నియోజక వర్గ అభివద్ధికి సహకరించాలని కోరుతూ స్టేషన్ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా తాటికొండ రాజయ్య గురువారం రాష్ట్ర ఆర్థిక , వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివద్ధికి శాఖా పరమైన నిధులు మంజూరు చేసి, తోడ్పాటు అందించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్, చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, చిల్పూర్ ఎంపీపీ బొమ్మిశెట్టి సరితాబాలరాజు , నియోజకవర్గ కోఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్ రెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రంగు రమేష్, తదితరులు పాల్గొన్నారు.