Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ భవేష్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో క్లస్టర్, డివిజన్ వారీగా సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంటల పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 2022-23కు గాను 5 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 487 రైతులకు చెందిన 1529 ఎకరాలలో మొక్కలు నాటినట్టు అధికారులు వివరించారు. గతంలో నిర్వహించిన సమావేశంలో ఆయిల్ పామ్ సాగు పెంపు లక్ష్యాలను నిర్దేశించుకున్నామని, ఎంత మంది రైతులను కలిసి వారికి అవగాహన కల్పించారని, ఎంతమంది సుముఖంగా ఉన్నట్లు గుర్తించారు, ఎంత మంది రైతులు ముందుకు వచ్చారనే వివరాలను క్లస్టర్ల వారి గా కలెక్టర్ ఆరా తీశారు. ఆయిల్ పామ్ సాగుతో నాలుగు సంవత్సరాలలో ఆదాయం కోల్పోకుండా అం తర్గత పంటలు వేసి ఆదాయం పొందవచ్చన్నారు. ప్రభుత్వం ఎకరానికి రైతు బంధుకు అదనంగా సంవత్సరానికి రూ.4200 సబ్సిడీ అందిస్తుంద న్నారు. రైతులకు అవగాహన కల్పించాలని సూచిం చారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న 3500 ఎకరాలలో మార్చి చివరి నాటికి ఆయిల్ పామ్ సాగు మొక్కలు నాటేలా వ్యవసాయ విస్తరణ అధికారులు లక్ష్యాలు నిర్దేశించుకొని పని చేయాలని ఆదేశించారు. మార్చి చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే మొక్కలకు డీడీ చెల్లించిన రైతుల నుంచి, డ్రిప్ కోసం సైతం డిడి తీసుకోవాలని, నూతనంగా ముందుకు వచ్చే రైతుల నుంచి డీడీ లు సేకరించాలని ఆదేశించారు. ఆయి ల్ పామ్ సాగు చేసేందుకు వీలుగా సబ్సిడీ పై డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారుల ద్వారా సేకరించిన దరఖాస్తులను ఉద్యాన శాఖ అధికారులు తీసుకొని మొక్కలకు సంబంధించిన రైతు వాటా డీడీలు సేకరించాలన్నారు. ఇప్పటి వరకు డీడీలు అందించిన రైతులకు వెంటనే పరిపాలన సంబంధిత మంజూరు చేసి, మెక్కలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి పరిధిలో సుమారుగా 1500 ఎకరాలలో గుర్తించిన రైతుల వివరాలను సంబంధిత ఉద్యాన శాఖ అధికారులకు అందించవలసిందిగా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని క్లస్టర్లలో నిర్మించిన రైతు వేదికల్లో ఆయిల్ పామ్ సాగు సంబంధించి విస్తత ప్రచారం, అవగాహన కార్యక్రమాలు కల్పించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్, జిల్లా హార్టికల్చర్ అధికారి సంజీవరావు, ఏఓలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.