Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసి నిర్మాణ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కొర్సా నరసింహమూర్తి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు
నవతెలంగాణ - ములుగు
పునర్ పరిశీలనకు వచ్చిన పోడు దరఖాస్తుల ఫారం పూర్తిగా లోప భూయిష్టంగా ఉందని, సరి చేసి సాగుదారు లందరికి హక్కుపత్రాలు ఇవ్వాలని ఆదివాసీ నవనిర్మాణ రాష్ట్ర అధ్యక్షులు బర్లగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ కొర్సా నరసింహమూర్తి, సంఘం కార్య నిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు వాసం నాగరాజు డిమాండ్ చేశారు. గురువారం వెంకటాపురం వాజేడు మండలలాకి చెందిన పోడు రైతులు ములుగు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ వెంకటాపురం మండలంలో 1750 పోడు దరఖాస్తులు చేసుకోగా కేవలం 70 మందికి మాత్రమే అర్హత లభించిందని అన్నారు. ఇది పూర్తిగా అధి కారుల తప్పిదమని అన్నారు. బర్లగూడెం గ్రామపంచా యతీలో 170 మంది దరఖాస్తులు చేసుకుంటే మొదట విడ తలో 12మందిని సెలెక్ట్ చేశారని, మిగతా 158 దరఖా స్తులను ఎందుకు పునర్ పరిశీలనకు జిల్లా కమిటీకి పంప లేదని ప్రశ్నించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం మూడు సార్లు ఒక దరఖాస్తు దారుడు ఆప్పిల్ చేసుకొనే వెసులు బాటు ఉందని తెలిపారు. పునర్ పరిశీలన దరఖాస్తు ఫారం లో దరఖాస్తుదారునికి నష్టం వాటిల్లే విధంగా 2005 తర్వా త సాగులో ఉన్నామని రాసి ఉందని తెలిపారు. దీన్ని తక్షణమే తొలింగించాలి అన్నారు. 2005 తర్వాత సాగులో ఉంటే అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఎలా ఇస్తారని, ఇది కుట్రపూర్వకంగా ఉందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో సాధారణ గ్రామసభలకు తావు లేదని కేవలం పేస గ్రామసభలు మాత్రమే పెట్టాలని తెలిపారు. పోడు భూముల దరఖాస్తులు పునః పరిశీలన పెసా గ్రామ సభ ద్వారా మాత్రమే జరగాలని డిమాండ్ చేశారు. కానీ అధికా రులు పెసా గ్రామసభలు నిర్వహించడం లేదన్నారు. అధికా రులే రహస్యంగా లబ్ధిదారుడికి ఇంటికి వెళ్లి మోసపూ రితంగా సంతకాలు తీసుకుంటున్నారని ఆర్డీవో రమాదేవికి తెలిపారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో పెసా గ్రామసభ పెట్టి దరఖాస్తుల స్వీకరించాలని కోరారు.సర్వే చేయని పోడు భూములను తక్షణమే సర్వే చేయాలని, సాగులో ఉన్న వార అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని ఆర్డిఓ రమాదేవిని కోరడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్డ్ చట్టాలకు అనుగుణంగా పెసా గ్రామసభ ద్వారా పునః పరిశీలన దరఖాస్తులను స్వీకరించే విధంగా, పోడు రైతులు కోరిన విధంగా అధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. మాజీ సర్పంచ్ మిచ్చా వెంకటరమణ, వెంక టాపురం, వాజేడు మండలాల పోడు రైతులు పాల్గొన్నారు.