Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి మార్చి 17 నుంచి మహా పాదయాత్ర
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కల్లపల్లి శ్రీనివాసరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
కేంద్ర బీజేపీ ప్రభుత్వం విభజన చట్టాలను విస్మ రించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కొము రయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో పొందుపర్చిన హామీలు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీ లాంటివి ఒక్కటి నెరవేర్చలేదని ఆరో పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివద్ధికై మార్చి 17 నుండి ఏప్రిల్ 17 వరకు సుమారు 30 రోజుల వరకు సిపిఐ మహా పాదయాత్రను నిర్వ హి స్తున్నట్టు తెలిపారు. బయ్యారం నుండి ప్రారంభమై ఏప్రిల్ 17న హైదరాబాద్‌లో ముగిసి ముగింపు సభ ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 పార్లమెంటులో చట్టం చేసిందని అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాకు రావాల్సిన పరిశ్రమలు ఉద్యోగాలు సమగ్ర అభివృద్ధికై పాదయాత్రలో చర్చించనున్నట్టు తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థాపించవలసిన ఫ్యాక్టరీలను బిజెపి పాలిత రాష్ట్రాలకు తరలించిన బీజేపీని ప్రజా ఉద్యమాల ద్వారా ఎండగట్టాలని అన్నారు. భూపాలపల్లి బొగ్గు గనుల ప్రైవేటీకరణ, హైదరాబాద్ హనుమకొండ పారిశ్రామిక కారిడార్, పోడు రైతులకు పట్టాలు వంటివాటితోపాటు రాష్ట్రాలకు రావలసిన వాటాపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు డబుల్ బెడ్ రూమ్ దళిత బంధ వంటి సమస్యలపై పోరాడుతున్న ప్రజలపై అణచివేత చర్యలు కాకుండా అమలు చేసే చర్యలు తీసుకోవాలన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రజా సంక్షేమ లక్ష్యంగా ఇచ్చిన హామీలను అమలుకై ప్రజలను సమీకరించి సుమారు 700 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 పెద్ద మహాసభలు నిర్వహి స్తామన్నారు. ప్రజలందరూ మద్దతు తెలిపి అన్ని రకాల ఆర్థిక సహాయ సహకారాలు అందించి జయ ప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి, వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, జనగామ జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజారెడ్డి, సీపీఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్ర బిక్షపతి, ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు, భూపాలపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులు కొరిమి సుగుణ మోటపలుకుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.