Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత్స్యకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగెల రమేష్
నవతెలంగాణ - వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మండలంలోని శివుని పల్లిలోని ఊరకుంటలో చెడు వ్యర్ధాలు పోయడం వల్ల నీరు కలుషితమై చేపలు చనిపో యాయని, చనిపోయిన చేపలకు నష్టపరిహారం చెల్లించి మత్స్యకారులను ఆదుకోవాలని తెలంగాణ మత్స్య కార్మిక సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగెల రమేష్ డిమాండ్ చేశారు. గురువారం మత్స్యకార్మికులతో కలిసి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధి ఊరకుంటను సంద ర్శించి మాట్లాడారు. గ్రామపంచాయతీ డంపింగ్ యార్డ్ లో పోయాల్సిన చెడు వ్యర్ధాలను ఊరకుంటలో పోయడం వల్ల నీరు కలుషితమై సుమారు 3 క్వింటాళ్ల చేపలు చనిపో యినట్టు తెలిపారు. ఎంపీడీవో స్పందించి చెడు వ్యర్ధాలను తొలగించి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య కార్మిక సంఘం మండల అధ్యక్షుడు చొప్పరి బిక్షపతి, శివునిపళ్లి సొసైటీ మాజీ కార్యదర్శి చిక్కుడు రమేష్, సొసైటీ సభ్యులు కొండ వేణు, కుంభం ఉపేందర్, చెన్నూరు వేణు, గుండ్లపల్లి రాజు, పరిష కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.