Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీఓ విక్రమ్‌కుమార్
నవతెలంగాణ-మల్హర్రావు
గ్రామాల్లో పారిశుధ్యం పట్ల పంచాయతీ కార్యదర్శులు, పారిశుధ్య సిబ్బంది అశ్రద్ధ చేస్తే చర్యలు తప్పవని ఎంపీఓ విక్రమ్‌కుమార్ హెచ్చరించారు. గురువారం మండలంలోని వల్లేంకుంట గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నరేశ్ ఆధ్వ ర్యంలో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించారు. గ్రా మంలో నర్సరీ, డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, సెగ్రిగేషన్ షేడ్, ఎవెన్యూ ప్లాంటేషన్, జీపీ రికార్డులు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, పశు వైద్యాశాలలు, ఆరోగ్య ఉపకేంద్రం, మంచినీటి వాటర్ ట్యాంకులను విస్తృతంగా పర్యవేక్షించారు. జీపీ సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ఇంటింటా తిరుగుతూ అవగాహన కల్పించాలన్నారు. తడి, పొడి చెత్తను సెగ్రిగేషన్ చేసి ఎరువుగా తయారు చేసి విక్ర యించడం ద్వారా జీపీ వనరులను పెంచాలని సూచిం చారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.