Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
సహకార సంఘాల పాలకవర్గాలు ఏర్పాటై ఈ నెల 15కు మూడేళ్లు పూర్తికావోస్తోంది. ఈ నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘంలో అధికారపార్టీ నేతలకు కొత్త తలనొప్పి మొదలు కానుంది. సహకార చట్టం ప్రకారం మూడేళ్ళ కాలానికి అవిశ్వాసం పెట్టే అవ కాశం ఉండడంతో ప్రస్తుత పాలకవర్గ పీఏసీఎస్ చైర్మన్ ఇటీవల సస్పెండ్ కావ డంతో వైస్ చైర్మన్, చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన ్‌పై సింగిల్ విండో డైరెక్టర్లు అవిశ్వాస అస్త్రాలను ప్రయో గించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాత్రధారులు, సూత్ర ధారులు ఎవరో తెలియాల్సి ఉంది. తాడిచెర్ల పీఏసీఎస్‌లో మొత్తం 13 సింగిల్ విండో డైరెక్టర్లు ఉండగా 2020లో నిర్వహించిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 6 డైరెక్టర్లు గెలిచి అధికార పార్టీ నుంచి చైర్మన్‌గా చెప్యాల రామారావు, వైస్ చైర్మన్‌గా మల్కా ప్రకాష్‌రావు ఎన్నికయ్యారు. ఇటీవల కొందంపేట గ్రా మానికి చెందిన సింగిల్ విండో డైరెక్టర్ నార సారయ్య అనారోగ్యంతో మృతి చెందగా, మూడు నెలల క్రితం అవినీతి ఆరోపణలపై చైర్మన్ పదవి నుంచి రామారావు సస్పెండ్ ఆయ్యారు. దీంతో వైస్ చైర్మన్‌గా ఉన్న మల్కా ప్రకాష్‌రావుకు చైర్మన్‌గా అధికారులు బాధ్యతలు అప్పజెప్పారు. ఈ క్రమంలో అవిశ్వా సానికి సమయం రావడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నాయి. అయితే 13 సింగిల్ విండో పదవులకు ప్రస్తుతం 11 మాత్రమే ఉన్నాయి. 6 గురు డైరెక్టర్లు మద్దతుతో చైర్మన్ అయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం కాగ్రెస్ డైరెక్టర్లు 5గురు ఉండగా, బీఆర్ఎస్కు చెందిన వారు 6గురు ఉన్నట్లు తెలుస్తోంది.