Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని, విద్యను బహుజన, బడుగు, బలహీన, మధ్యతరగతి, పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారుస్తున్నారని, ఇందులోభాగంగానే బడ్జెట్లలో మొండిచేయి చూపించారని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు యాకన్ననాయక్ అర్జున్ విమర్శించారు. గురువారం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవే శపెట్టిన బడ్జెట్లో రూ.1.12 లక్షల కోట్లు మాత్రమే విద్యారంగానికి కేటాయిం చారని అన్నారు. గత సంవత్సర బడ్జెట్ కంటే కేంద్ర బడ్జెట్ ఈ సంవత్సరం 7.5 శాతాన్ని పెంచినప్పటికీ విద్యారంగానికి కనీసం ఒక శాతం కూడా మొత్తం బడ్జెట్ నుండి కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి రూ.19000 కోట్లను మాత్రమే కేటాయించారన్నారు. గత సంవత్సరం కేటాయించిన మొత్తం బడ్జెట్ కంటే ఈసారి 1.3 శాతం పెరిగినప్పటికీ ఆశాజనకంగా నిధులను కేటాయించడం లేదని మండిపడ్డారు. అలాగే విద్యారంగానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. మన ఊరు మనబడి, మనబస్తీ మనబడి ద్వారా పాఠశాలల అభవృద్ది నిమత్తం పలు పాఠశాలలు ధ్వంసం చేసి అనంతం నిధులు విడుదల చేయక మధ్యలోనే వదిలేశారన్నారు. విద్య సంవత్సరంలో యూనిఫార్మ్స్, పాఠ్యపుస్తకాల సక్రమంగా అందజేయలేదని, మధ్యాహ్న భోజన విడ్డేమీల్ వర్కర్లకు బిల్లులను ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదని, పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ లను విడుదల చేయలేదన్నారు. ఎస్ఎఫ్ఐ మండల నాయకులు విద్యార్థులు తదితర పాల్గొన్నారు.