Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం నాయకులు మంద సంపత్
నవతెలంగాణ-హన్మకొండ
హనుమకొండ జూపార్క్ ఎదురుగా ఉన్న 964 సర్వే నెంబర్ లో ఉన్న ప్రభు త్వ భూమిని అక్కడ గుడిసెలు వేసుకున్న పేదలకు ఇవ్వాలని సిపిఎం నాయకులు మంద సంపత్ డిమాండ్ చేశారు. గురువారం జూపార్కు ఎదురుగా ఉన్న ప్రభు త్వ భూమి సర్వే నెం.964 లో సిపిఎం ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకొని ఉంటు న్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ భూములను భూకబ్జా దారులు మరియు రియల్ఎస్టేట్ వ్యాపారుల నుండి రక్షించాలని అలాగే ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని ఉన్న పేద ప్రజలకు జి వో 58 ప్రకారం పట్టాలు యివ్వాలని సీపీఎం హనుమకొండ జిల్లాకమిటీ సభ్యులు తెలిపారు. అలాగే ఇండ్లులేని నిరు పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇస్తాము అని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదని, నగరంలో యేండ్ల తరబడి నివసిస్తున్న ప్రజలు ఇం టి కిరాయి కట్ట లేక ఇబ్బంది పడుతున్నారన్నారు అని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకుంటున్న అధికారులు పట్టిచుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూములలో గుడిసె లు వేసుకుని జీవిస్తున్న వారికి పట్టాలివ్వాలనిడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు దూడపాక రాజేందర్, అలకుంట్ల మల్లయ్య, కంచర్ల కుమరస్వామి, ఎన్నాం వెంకటేశ్వర్లు, మరియు గుడిసేవాసులు పాల్గొన్నారు.