Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
మెట్టుగుట్ట దేవాలయాన్నిమరోయాదాద్రి రీతిలో తీర్చిదిద్దడానికి తనవంతు కృషి చేస్తానని వర్ధ న్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఆరూరి రమేష్ అన్నా రు. మడికొండ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆల యంలో దేవస్థాన నిధులు రూ.6.98 కోట్లతో నిర్మించనున్న దేవాలయ ప్రాకార మండపం, రాజగో పురాల నిర్మాణానికి శంకు స్థాపన కార్యక్రమం శుక్రవా రం నిర్వహించగా కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపే ట ఎమ్మెల్యే అరూరి రమేష్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పను లకు శంకుస్థా పనచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణకాశీగా పేరు గాంచిన మెట్టుగుట్ట దేవాలయ అభివద్ధికి నిరంతరం కషి చేస్తున్నట్లు తెలిపారు. 6 కోట్ల 98 లక్షలతో ప్రాకార మండపం రాజగోపాల నిర్మాణానికి శంకుస్థా పన చేయడం జరిగింది. యాదగిరిగుట్ట రీతిలో దేవా లయాన్ని తీర్చిదిద్దడానికి ప్రత్యేక నిధులు కేటాయిం చడం జరుగుతుందన్నారు.
అతి త్వరలో రూ.23 కోట్ల నిధులు కేటాయిస్తూ దేవాలయ విశిష్టతను ప్రజలకు తెలియజేయడానికి, గుట్టపై 100 గదుల సత్రం, పర్యాటకుల కొరకు 10 కాటేజీలను నిర్మించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స హకారంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. జర గనున్న మహాశివరాత్రి వేడుకలను అంగరంగ వైభ వంగా నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మునిగాల స రోజన, ఆవాల రాధిక రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్ రావు, పీఏ సీఎస్ చైర్మన్ ఊకంటి వనం రెడ్డి, ఈవో శేషు భారతి, ఆలయ కమిటీ చైర్మన్ దువ్వ నవీన్, డివిజన్ అధ్యక్షు లు బొల్లికొండ వినోద్ కుమార్, నాయకులు పోలేపల్లి రామ్మూర్తి, మాజీ కార్పొరేటర్ బస్కే శ్రీలేఖకృష్ణ, మం డల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ కంకణాల సంప త్‌రెడ్డి, కమిటీ సభ్యులు, డివిజన్ నాయకులు, ఆల య పూజారులు,అధికారులు పాల్గొన్నారు.