Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
ఏడవ తెలంగాణ సబ్- జూనియర్ కెడిట్ అంతర్ జిల్లా జూడో ఛాంపియ న్షిప్ పోటీలలో మడికొండ నందు గల తె లంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బా లికల పాఠశాల కళాశాల జూడో క్యాంప్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి పథకాలు సాధించడం జరిగింది. ఈ సం దర్భంగా విద్యార్థులను వరంగల్ జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారిని విద్యా రాణి, హనుమకొండ జిల్లా సమన్వయ అధికారిని డి.ఉమామహేశ్వరి లు అభినందించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సబ్-కెడిట్ అంతర్ జిల్లాస్థాయి జూడో ఛాంపియ న్షిప్ 2023 ఫిబ్రవరి నెల 7, 8వ తేదీలలో కరీంన గర్లోని అంకమ్మ తోట లో నిర్వహించడం జరిగింది. పోటీలలో మడికొండ సిఓఈ గురుకుల విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి పథకాలు సాధించడం జరిగింది.అండర్ 32 కేజి అక్షిత, 57 స్పందన, 52 గంగోత్రి, 63 ప్రగతి, 48 దివ్య, 44 అనుష, 57 బేబీలతా విద్యార్థినిలు బం గారు పతకాలను, నిరీక్షణ, కీర్తి, నక్షత్ర, అంజలి, అర్చన, దీపిక, నక్షత్ర లు వెండి పథకాలు, శ్రావణి, హన్సిక, సాయి చరణ్య,సాయి, రశ్మిత, సాయిప్రీతి, చరి ష్మా, కపలు కాంస్య పతకాలను సాధించారు.
ఈనెల 17 నుండి 22 వరకు చెన్నై లో జరిగే జాతీయ స్థాయి జూడో చాం పియన్షిప్ 2023 పోటీలకు అక్షిత, స్పం దన, దివ్య, అనూష, బేబీ లతా, గంగోత్రి, ప్రగతిలు పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు ప్రతిపని కనబరిచి బంగారు పతకాలు సాధించడం పాఠశాల గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కోచ్ నాగరాజు, పిడి పద్మ, పిఈటి సరిత అధ్యాపక బందం విద్యార్థులు పాల్గొన్నారు.