Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జిల్లా జెడ్పీచైర్పర్సన్ గండ్ర జ్యోతి
నవతెలంగాణ-శాయంపేట
ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రభుత్వ నిబంధనలకు లోబడి గ్రామీణ ప్రాంత ప్ర జలకు వైద్య సేవలు అందించాలని వరంగల్ జిల్లా జడ్పీచైర్ పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండల కేంద్రంలోని ఎస్వీకేకే ఫంక్షన్హాల్లో శుక్రవారం ఆర్ఎంపి, పిఎంపి వెల్ఫేర్అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆ విష్కరణ కార్యక్ర మం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొని క్యాలెం డర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ఎంపి, పిఎంపి లు పరిమితికిమించి వైద్యం చేయవద్దన్నారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించేది ఆర్ఎంపి లేనని పేర్కొన్నారు. గ్రామాలలో పేద ప్రజలు ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్నారంటే ప్రధాన కారణం ఆర్ఎంపిలే అని అన్నారు. ప్రభుత్వం నుంచి ఆర్ఎంపీలకు తగిన గుర్తింపు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామీణ వైద్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో టేకుమట్ల జడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మండల వైద్యాధికారి డాక్టర్ సాయి కష్ణ, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు అబ్బు ప్రకాష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గాజే రాజేందర్, సంఘం మండల అధ్యక్షులు కానుగుల నాగరాజు, ప్రధాన కార్యదర్శి అబ్బు జయపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు కందగట్ల అనిల్, కోశాధికారి చెక్క బిక్షపతి, సహాయ కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, ఆర్ఎంపి, పీఎంపీలు పాల్గొన్నారు.