Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తనిఖీల పేరుతో కాలయాపన చేస్తున్న అధికారులు
- కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న బాధితులు
నవతెలంగాణ-వరంగల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్ పర్మిషన్ సులువుగా పొందేందుకు టీఎస్ బీపాస్‌ను 2019లో ప్రవేశపెట్టింది. బిల్డింగ్ పర్మిషన్ కోసం టీఎస్ బి పాస్ కింద అప్లై చేసిన 21 రోజుల్లో బిల్లింగ్ పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాప్పటికీ పర్మిషన్ సులువుగా రావడం లేదు. సంబంధిత కొంతమంది అధికారుల వెరిఫికేషన్ చేయడం మాత్రం తీవ్రంగా జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేసిన తర్వాత ముందస్తుగానే డబ్బులను ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. కానీ సంబం ధిత అధికారులు సరియైన సమయంలో పర్యవేక్షణ చేయక నెలలతరబడి బాధితులు కార్యాలయాలు చు ట్టు తిరిగినప్పటికీ ఆ ఫైలు క్లియర్ కావడం లేదనీ తీరా ఏదోఒక సాకుతో ఫైల్‌ను క్యాన్సిల్ చేయడం జ రుగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్డింగ్ పర్మిషన్ ఫైల్ క్యాన్సిల్ అయితే వెంటనే డ బ్బులు తిరిగి బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేసుకున్న వారి ఖాతాలో జమ కావాలి. కానీ రిఫండ్ టేబుల్ డబ్బు లు కూడా తిరిగి రావడా నికి నెలల తరబడి బాధితు లు ఎదురుచూస్తున్నారు సంబంధిత అధికారులను అడిగిన పర్యవేక్షణ చేసిన తర్వాత షోకాస్ నోటీసి ఇ చ్చిన తర్వాత అప్పుడు మా త్రమే డబ్బులు పడతాయని అధికారులు ఒక వైపు చెప్తున్నారు. కానీ డిప్యూటీ కమిష నర్లు పన్నుల విభా గం, న్యూఅసెస్మెంట్ పైల్స్‌తో తలలు పట్టుకుంటు న్నారంటే, టీఎస్‌బీపాస్ ఫైళ్లను వారికే అప్పజెప్ప డం తో డిప్యూటీ కమిషనర్లు పర్యవే క్షణ చేయలేక కొంత మేరకు ఫైల్లో పెండింగ్ ఉంటున్నాయేమో అనే సందేహాలు కలగకమానదు. చాలా నెలల తరబడి ఫై ల్ పెండింగ్‌లో ఉండడం వల్ల బాధితులు కార్యాల యం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని సమయంతో పాటు డబ్బు ఖర్చవుతుంది. కానీ సమస్యమాత్రం ప రిష్కారం కావడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ డిప్యూటీ కమిషనర్ త్వరగా పర్యవేక్షణ చేసి అన్ని పత్రాలు సరిగా ఉంటే వెంటనే బిల్లింగ్ పర్మిషన్లు ఇవ్వాలని, ఒకవేళ బిల్డింగ్ పర్మిషన్ క్యాన్సిల్ అయితే త్వరగా పర్యవేక్షణ చేసి తిరిగి డబ్బు లు జమ అయ్యే విధంగా చూడాలని పలువురు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. కిందిస్థాయి అధికారులు పర్యవేక్షణ చేసినప్పటికీ డిప్యూటీ కమిషనర్ స్పెషల్ ఎంక్వయిరీ పేరుతో ఫైళ్ళను పెండింగ్ పెడుతున్నా డని పలువురు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్న తాధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న బిల్లింగ్ పర్మి షన్లను ఫైళ్లను అప్రూవల్ చేయాలనీ, లేదా క్యాన్సిల్ అయిన బిల్లింగ్ పర్మిషన్ పైళ్లకు డబ్బులు తిరిగి జమ ఎందుకుచర్యలుచేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ఏడు నెలలైనా ఫైల్ కదలట్లే : సాంబరాజు, బాధితుడు
బిల్లింగ్ పర్మిషన్ కోసం ముందస్తుగా రూ. 2.7 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాం. రోడ్డుకు ఇంటికి 90 ఫీట్లదూరం స్థలానికి రోడ్డు డీవియేషన్ పేరుతో బి ల్డింగ్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. షోకాస్ నోటీస్ కూ డాఇచ్చారు. నెలల తరబడి నుండి కోసం రిఫాండ బుల్ కోసం కార్యాలయంలో చుట్టూ ప్రదక్షిణలు చ ేస్తున్న ఇంతవరకు ఫైల్ పర్యవేక్షణ పేరుతో జాప్యం అవుతున్నది. త్వరగా డబ్బులు రిఫెండబుల్ కావాలి.
సరైన పత్రాలతో పరిమిషన్ కు అప్లై చేసుకోవాలి : శ్రీనివాస్ రెడ్డి డిప్యూటీ కమిషనర్
టీఎస్ బిపాస్ అప్లై చేసుకునేటప్పుడు అన్ని సరైన పత్రాలు తో బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేసుకోవా లి. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతే టి ఎస్ బి పాస్ లో మీరు చెల్లించిన డబ్బులు రావడానికి మొదటగా షోకాస్ నోటీస్ ఇచ్చిన తర్వాత డబ్బులు రిఫండ్ డబ్బుల్ అవుతాయి.