Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్
నవతెలంగాణ - ములుగు
రెండు నాల్కల ధోరణి అవలంబిస్తూ, ములుగు జిల్లా ప్రజలను ఎమ్మెల్యే మభ్య పెడుతున్నరాని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క) రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నాయకుల పట్ల విమర్శలు చేస్తు, అసెంబ్లీ సమావేశాలో ములుగు జిల్లా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషికి కృతజ్ఞతలు తెలపడం ఎమ్మెల్యే ద్వందనీతికి రెండు నిదర్శనమన్నారు. జిల్లా ప్రజలు, విద్యార్థులు, మేధావులు, నాయకులు, ఎమ్మెల్యే మాట్లాడే విధానం తీరు గురించి ఆలోచించాలని గుర్తు చేశారు. రాష్ట్రంలో దొరల పాలన, గడీల పాల న, రాక్షస పాలన నడుస్తుందని అసెంబ్లీ వెలుపల, ములుగు జిల్లా ప్రజల్లో విమర్శిస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ములుగు జిల్లాకి ఏటూరు నాగారంలో డయాలసి సెంటర్, అగ్నిమాపక కేంద్రం, ములుగు గ్రామపంచాయతీని మున్సిపాలిటీ ప్రకటిస్తూ అనేక విధాలుగా అభివద్ధి చేస్తున్నందుకు కతజ్ఞతలు చెప్పి రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని పేర్కొనడం సరికాదన్నారు. ములుగు జిల్లాలో ఏకపక్షంగా దళిత బందు పథకాన్ని పంపిణీ చేసిన మీరు ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు లాగా ఆదివాసి,గిరిజనులను, వెనుకబడిన తరగతుల వారిని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉపయోగించుకుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం చెప్పారు.