Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ రమేష్
నవతెలంగాణ- ములుగు
టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి యాత్రకు ప్రజా స్పందన చూసి బిఅర్ఎస్ నాయ కులకు మతిభ్రమించి ఓర్వలేక విషం కక్కుతూ మాట్లాడటం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ బొమ్మకంటి రమేష్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయంలో మీరు చేస్తున్న రాద్దాంతం ఎంటని, మీ రాష్ట్రం లో మీ పార్టీ ఎంపీ లు ఉంటారని, కనీసం గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడారా అని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో దోస్తీ ఉందని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ములుగు కు గిరిజన యూనివర్సిటీ కేటాయించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ములుగు జిల్లా కు సమ్మక్క సారలమ్మ జిల్లాగా నామకరణం చెయ్యడం, మల్లంపెల్లి మండలం చెయ్యడం బీఆర్ఎస్ నాయ కులకు ఇష్టం లేదన్నారు. గిరిజన యూనివర్సిటీ కి స్థలం కేటాయించామని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై ఎందుకు ఒత్తిడి తీసుకు రావడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మేడారం జాతర అభివృద్ధి జరిగిందనీ,రేవంత్ రెడ్డి మొదటి అడుగు బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయన అన్నారు. అంబేడ్కర్ ని అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు కొత్త నాటకానికి తెర లేపారన్నారు. బీఆర్ఎస్ పాలనలో దళితుల పై మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. ములుగు జిల్లా ఉద్యమంలో వారు ఎక్కడా లేరని, అన్నారు. త్యాగాలు తమవి బోగాలు మీవా అన్నారు. రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఖబర్ధార్ అని హెచ్చరించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన ఒక హామీ నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసగిస్తున్నా రన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే అబివృద్ధి సాధ్యం అని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్నారు.