Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
ఆపదలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుని కాపాడుకుంటామని కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అద్యక్షుడు గుమ్మడి సోమయ్య భరోసా ఇచ్చారు. శుక్రవారం మండలంలోని రమణక్కపేట గ్రామానికి పార్టీ సీనియర్ నాయకులు కాకి నాగ శ్రీను మతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని భరోసాఇచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి, నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్సార్ ఖాన్, మండల ఉపాధ్యక్షులు భగవాన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అయ్యోరి యానయ్య, సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలకష్ణ, జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు పయ్యావుల బాబూరావు, పొట్రు సమ్మయ్య, బొనుగు సుబ్బారావు, కరకపల్లి సాంబమూర్తిలు పాల్గొన్నారు.